Rabya khan insists jia s death a homicide but not a suicide

Rabya Khan insists Jia's death a homicide but not a suicide, Hindi actress Jia Khan death, Jia Khan suicide or homicide, Rabya Khan knocks High court doors again

Rabya Khan insists Jia's death a homicide but not a suicide

జియాది హత్యే కాని ఆత్మహత్య కాదు- రబియా ఖాన్

Posted: 03/04/2014 12:22 PM IST
Rabya khan insists jia s death a homicide but not a suicide

జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ (53) తన కూతురిది ఆత్మహత్య కాదని కొందరు సాక్ష్యుల ఆడియో వాగ్మూలాన్ని తీసుకుని హైకోర్టు గడప మళ్ళీ తొక్కారు.  ఆమెను కేసు ఉపసంహరించుకోమంటూ ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఫిబ్రవరి 25న బెదిరించాడని కూడా ఆమె లోగడ తెలియజేసారు. 

ఆమె రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు వీరు-

ఆరోజు జియా నివాసమున్న భవనం బయట విధుల్లో ఉన్న వాచ్ మన్ సురేంద్ర యాదవ్, ఆ రోజు సూరజ్ పంచోలీ దగ్గర పనిచేసే దేవా పుష్ప గుచ్ఛాన్ని తీసుకుని వచ్చాడని, అతను 6 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు వెళ్ళాడని చెప్పిన వాచ్ మన్, మొదటిసారి పుష్ప గుచ్ఛాన్నిచ్చి, రెండవసారి ఆల్ ది బెస్ట్ కార్డు మర్చిపోయానని రెండవసారి వెళ్ళాడట. 

రెండవ సాక్షి పుష్పగుచ్ఛాలను విక్రయించే శంకర్ అండ్ బహులే దుకాణం.  దేవా ఒకేసారి వచ్చాడని, పుష్పగుచ్ఛంతో పాటు ఆల్ ది బెస్ట్ కార్డ్ కూడా అప్పుడే తీసుకునిపోయాడని రబియా తో అన్నారు.  కానీ పోలీస్ రికార్డ్ చేసిన వాంగ్మూలంలో అతను రెండవసారి కార్డ్ కోసం వెళ్ళినట్లుగా ఉంది. 

మరణిస్తున్న జియాను పరీక్షించిన డాక్టర్ అగర్వాల్ అప్పటికే ఆమె మరణించిందని చెప్పారని పోలీస్ రికార్డ్ లో ఉండగా, లేదు ఆమెను హాస్పిటల్ కి చేర్చిన తర్వాత మరణించిందని రబియా స్టేట్ మెంట్ చెప్తోంది. 

రబియా స్నేహితురాలు అంజు మహేంద్రా కూడా పోలీసు రికార్డ్ లో ఉన్నదానికి భిన్నంగా మాట్లాడుతూ, ఇంటి కిటికీ తలుపులను ఆమె తెరవలేదని, ముందే తెరిచివున్నాయని చెప్తూ ఉరిపోసుకుని ఉన్న తాడుకి రెండు మూడ ముళ్ళు లేవని, కేవలం ఒకే ఒక్క ముడి ఉందని చెప్పారు.

జియా కేసులో ఇప్పటికే ఆత్మహత్యకు దారితీయటానికి సూరజ్ పంచోలీ కారకుడని అందిన సాక్ష్యాధారాలనుబట్టి జుహు పోలీస్ ఛార్జ్ షీట్ ని దాఖలుచేసారు.   కానీ అది ఆత్మహత్య కాదని, హత్యే జరిగిందని ఆరోపిస్తూ రబియా తనదగ్గరున్న సాక్షుల వాంగ్మూలాన్ని చేతపట్టుకుని మరోసారి హైకోర్టు తలుపుతట్టారు.  పోలీసులు జియా ముంజేతికి ఉన్న దెబ్బను విస్మరిస్తున్నారని, చేతిని గట్టిగా పట్టుకోబట్టే దెబ్బ తగిలివుంటుందని రబియా లోగడ ఆరోపించారు. 

పోలీసుల కథనం ప్రకారం జూన్ 3, 2013 న చనిపోయిన జియా ఆత్మహత్యకు అంతకు ముందు ఆమె ప్రియుడు సూరజ్ పంచోలీ ఆమెతో గొడవపడి ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేయటం, సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ పుష్పగుచ్ఛాన్ని పంపించటం, ఆమెకు సినిమాల్లో అవకాశాలు లేకపోవటం ఇవన్నీ కారణాలని తేల్చారు. అయితే, అదంతా సరికాదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం జియాకు లేదని, అది నిస్సందేహంగా హత్యేనని రబియా ఖాన్ వాదన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles