Direct depoist in cooking gas discontinued

Direct depoist in cooking gas discontinued, cooking gas cylinders, subsidy on cooking gas, aadhar link for gas subsidy

Direct depoist in cooking gas discontinued

వంట గ్యాస్ నుంచి తెగిన ఆధార్ లింక్

Posted: 03/07/2014 10:07 AM IST
Direct depoist in cooking gas discontinued

వంట గ్యాస్ సిలెండర్ల మీద రాయితీని వినియోగదారుల ఖాతాలలో జమకట్టే పద్ధతికి స్వస్తి చెప్తూ ఈ నెల పదవ తేదీ నుండి రాయితీని తగ్గించిన ధరకే సరఫరా చెయ్యబోతున్నారు.   ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.  

అంతకు ముందులాగానే గ్యాస్ సిలెండర్లను రాయితీ ధరకే వినియోగదారులకు అందించబోతున్నారు.  దానితో మధ్యలో వచ్చిన ఆధార్ లింక్ తెగిపోయింది.  ముందు పూర్తి ధరను కట్టటం, వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో మార్కెట్ రేటుకి, రాయితీ తర్వాత రేటుకి ఉన్న వ్యత్యాసాన్ని గ్యాస్ కంపెనీలు జమకట్టటం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారటంతో చాలామంది అందుకు వ్యతిరేకంగా కోర్ట్ లలో పిటిషన్లు కూడా వేసారు.

చాలా మందికి ఆధార్ నంబర్ లేకపోవటం కూడా నగదు బదిలీలో సమస్యలను రేకెత్తించింది.  దానికి తోడు మొత్తం మార్కెట్ రేటుని కట్టి బ్యాంక్ లో జమ అవకపోవటం లాంటి అవకతవకలు కూడా జరిగాయి.  పథకం మంచిదే అయినా వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఇబ్బందులు మొదలయ్యేటప్పటికి ఎన్నికల ముందు ఈ చికాకులు ఎందుకు దాన్ని తీసేస్తే పోలే అనుకున్నట్టుంది కేంద్ర ప్రభుత్వం, ఈ నిర్ణయం తీసుకుంది.  

ఈ నిర్ణయం వలన, సమస్య మొదలైంది ఆ ప్రభుత్వ నిర్ణయం వలనే అయినా, ఇప్పుడు సేదతీరేటప్పటికి హమ్మయ్య మంచిపని చేసారు అనిపిస్తుంది ప్రజలకు.  దానితోపాటు ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదు.  ఎందుకంటే రాయితీ పెంపులాంటి నిర్ణయం కాదు కాబట్టి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles