Gom on state division meet

GoM on state division meet, AP State reorganization bill 2014, Sushil Kumar Shinde led GoM, Chidambaram, Antony, Gulam Nabi Azad, Jairam Ramesh

GoM on state division meet, AP State reorganization bill 2014, Sushil Kumar Shinde led GoM

రాష్ట్రవిభజన మంత్రుల బృందం సమావేశం

Posted: 03/21/2014 10:07 AM IST
Gom on state division meet

ఈరోజు రాష్ట్ర విభజనకోసం ఏర్పడ్డ మంత్రుల బృందం ఢిల్లీలో సమావేశం కనుంది.  ఈ క్రింది అంశాలు ఆ సమావేశంలో చోటుచేసుకునే అవకాశం ఉంది.

1.విభజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసిన పనులను సమీక్షించటం.  ఇందుకు తాజాగా రాష్ట్రంలో పర్యటించిన హోంశాఖ కార్యదర్శి గోస్వామి ఇచ్చే నివేదికను పరిశీలిస్తారు.

2. గవర్నర్ సలహాదారుల నియామకం.

3. సీమాంధ్రకు కొత్త రాజధాని కమిటీ నియామకం.

4. ప్రణాళిక సంఘంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చెయ్యటం ద్వారా విభజించబడ్డ రెండు రాష్ట్రాలకు అభివృద్ధిలో తోడ్పడటానికి ఏర్పాట్లు.

5. ఇరు ప్రాంతాల ఆస్తులు అప్పుల పంపిణీ.

హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నాయకత్వంలో సాగుతున్న మంత్రుల బృందంలో రక్షణ మంత్రి ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్, పిఎం కార్యాలయ శాఖా మంత్రి నారాయణస్వామి ఉన్నారు. 

ఈరోజు చేసే చర్చల ఫలితాన్ని మంత్రుల వర్గం నివేదిక రూపంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కి, యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి సమర్పిస్తారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles