Janasena pawan kalyan reached vizag fans rally

pawan kalyan, pawan janasena, pawan janasena party, pawan kalyan reached vizag, fans rally, janasena pawan kalyan reached vizag, Pawan Kalyan Fans Bike rally in Vizag,Jana Sena 1st public meet, Pawan Kalyan fans, airport as rally, pawan kalyan vizag speech, pawan janasena party speech, janasena meeting in vizag, pawan kalyan speech at vizag meeting, pawan kalyan vizag meeting, pawan kalyan jana sena vizag meeting, jana sena party vizag meeting, pawan kalyan ism book launch, raju ravitej, trivikram srinivas.

janasena pawan kalyan reached vizag fans rally

విశాఖలో పవన్ అడుగు- అభిమానుల ర్యాలీ?

Posted: 03/27/2014 01:28 PM IST
Janasena pawan kalyan reached vizag fans rally

 పవర్ స్టార్ పవన్  కళ్యాణ్  స్థాపించిన   ‘‘జనసేన’’ పార్టీ  భారీ బహిరంగం సభ  ఈరోజు  సాయంత్రం 4.00 గంటలకు  వైజాగ్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతుంది. అయితే   ఈరోజు ఉదయమే జనసేన పార్టీ అధినేత  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు.  జనసేన పార్టీ  అధినేతగా పవన్ కళ్యాణ్  మొదటి సారి  విశాఖలో అడుగు పెడుతున్న సమయంలో  భారీ ఎత్తున్న అభిమానులు   విమానశ్రయానికి  చేరుకున్నారు.     

మొదటి సారి వైజాగ్ జనసేన పార్టీ  నిర్వహించనున్న  బహిరంగ సభకు మద్దుతుగా  పవన్ అభిమానులు   పెద్ద ఎత్తున  బైకు ర్యాలీ చేపట్టారు.  మద్దిలపాలెం ఏయూ ఇంజినీరింగ్  కళాశాల ప్రధాన  ముఖద్వారం వద్ద  నుంచి  బైకు ర్వాలీ నిర్వహించారు.   ఈ ర్యాలీలో  భారీ ఎత్తున  యువత పాల్గొన్నారు.  మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ,  పెదవాల్తేరు, ఆర్టీసీ కాంప్లెక్సు  తదితర ప్రాంతాల మీదుగా ర్యాలీ సాగింది. 

అంతేకాకుండా  జనసేన పార్టీకి  ప్రజల్లో  విశేష ఆదరణ  ఉందని   పార్టీ ప్రతినిది  సందీప్ అన్నారు.  బీచ్ రోడ్డులో  ర్యాలీ నిర్వహించారు. ముందుగా  భగత్ సింగ్ విగ్రహానికి  జనసేన పార్టీ కార్యకర్తలు , యవకులు పూలమాలలతో  నివాళులర్పించారు.   ఈ సందర్భలో  జనసేన పార్టీకి  జై అంటూ  నినాదాలు  చేశారు.   వై.ఎం.సి.ఎ. నుంచి ఆర్ .కె.బీచ్  వరకు జనసేన జెండాలు  చేతపట్టుకొని  యువకులంతా  నడుస్తూ నినాదాలు  చేశారు. 

ఈ సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు విశాఖ విమానాశ్రయానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.కాగా సాయంత్రం జరగబోయే సభలో పవన్ ఏం మాట్లాడాతారనేది రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోంది. ఇదే సభలో 150 పేజీల ఇజం పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించనున్నారు. 

అయితే హైదరాబాద్‌ సభలాగా ఇక్కడ కూడా పవన్‌ వన్ మ్యాన్ షో ఉంటుందా లేక వేరే ఎవరికైనా మాట్లాడే అవకాశముందా ఇంకా తెలియలేదు. కాగా గత కొద్దిరోజుల నుంచి సభా ఏర్పాట్లను పివిపి సంస్థ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. విశాఖ సభకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షమంది వస్తారని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు.  

ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని నగరంలో పవన్ అబిమానులు ప్రచార ర్యాలీలు  నిర్వహిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో  జనసేన పార్టీ అధినేత  పవర్  స్టార్ పవన్ కళ్యాణ్  వాయిసే  వినే అద్రుష్టం  అందరికి కలుగుతుంది. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles