Chandrababu elections boons to women

Chandrababu elections boons to women, Telugu Desam party, Chandra Babu Naidu, NT Rama Rao, Dwcra groups, Cell phones and cycles to women promised by Chandrababu

Chandrababu elections boons to women, Telugu Desam party, Chandra Babu Naidu, NT Rama Rao, Dwcra groups, Cell phones and cycles to women promised by Chandrababu

మహిళా గర్జనలో పండంటి బిడ్డకు తెదేపా హామీ

Posted: 03/28/2014 08:01 AM IST
Chandrababu elections boons to women

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో జరిగిన మహిళా గర్జన సభలో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత పండంటి బిడ్డ పథకాన్ని అమలులోకి తెస్తామని అన్నారు.   తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి ఈ పండంటి బిడ్డ పథకంలో బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు పౌష్టికాహారం కోసం పది వేల రూపాయలను కేటాయిస్తామని చెప్పారు.  

ఆరోగ్యంతో పాటు మహిళలకు రక్షణ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సభా ముఖంగా విజయవాడ సాక్షిగా చెప్తున్నానంటూ పూర్తి హామీ ఇస్తూ, మహిళలపై తెగబడేవారి గుండెల్లో నిద్దపోతామన్నారు.  మహిళలందరికి సెల్ ఫోన్లు ఇస్తామని, అందులో ఉండే మీటను ఆపద సమయంలో నొక్కినట్లయితే ఆ సమయంలో ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేసి వాళ్ళకి రక్షణ కల్పిచటం జరుగుతుందని అన్నారు చంద్రబాబు.  ఢిల్లీలో జరిగిన అకృత్యాన్ని గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత నిర్భయ చట్టం తీసుకునివచ్చినా పరిస్థితుల్లో తేడా ఏమీ రాలేదని, మహిళలపై హింసాకాండలు యధావిధిగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. 

గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళమీద అత్యాచారాలు జరగలేదని అన్న చంద్రబాబు, మహిళలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు.  ఎన్టీఆర్ ఆస్తి హక్కులో మహిళలకు 9 శాతం కల్పించారని గుర్తు చేస్తూ, చదువులేని మహిళలను డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగేలా చేసింది తెదేపాయేనని అన్నారు.  ఆ డ్వాక్రా ఋణాలు కూడా మాఫీ చేయిస్తామని అన్నారు. 

ఇంకా, మహిళలకు ఉచితంగా సైకిళ్ళు, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ లు కల్పించటం లాంటి మహిళా సంక్షేమ కార్యక్రమాలను తెదేపా చేపడుతుందని చంద్రబాబు మహిళా గర్జనలో వెల్లడి చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles