Congress party releases telangana candidates list

Congress party releases Telangana candidates list, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 Telugu Desam party, Telangana Rashtra Samiti,

Congress party releases Telangana candidates list

ఒక కుటుంబం నుంచి ఒక్కరే- కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

Posted: 04/08/2014 07:49 AM IST
Congress party releases telangana candidates list

ఇతర పార్టీలు ఇంకా కసరత్తు పూర్తి చెయ్యకుండా దశలవారీగా జాబితాలను విడుదల చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణాలో 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసింది. 

మిగతా విషయాలను పాటించకపోయినా, నాయకుల వారసులను పక్కకు పెట్టాలనే నిబంధనను పూర్తిగా పాటించింది కాంగ్రెస్ పార్టీ.  ఇప్పటికే వారసుల పార్టీ అనే ముద్ర పడినందువలన ఆ సాంప్రదాయాన్ని కింది వరకూ సాగనివ్వకుండా కట్టుదిట్టాలు చెయ్యటం జరిగింది.  నాయకుల భార్యలు, సంతానాలకు టికెట్ ఇవ్వలేదు. 

అభ్యర్థుల కొరత ఉంది కాబట్టి వారసులను రంగ ప్రవేశం చేయించటానికి ఇదే సమయమని అనుకున్న వారి ఆట కట్టయింది.  వాళ్ళల్లో పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, ఉత్తమ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన రెడ్డి కూతురు స్రవంతి, దామోదర రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, ఇలా దగ్గరి వాళ్ళ అభ్యర్థనలను పక్కకు పెట్టటమే కాకుండా, కొందరు నాయకుల బంధువర్గానికి కూడా సీటు ఇవ్వలేదు.  వాళ్ళల్లో దామోదర రాజనరసింహ, విద్యాసాగర్, ముఖేష్ గౌడ్ తదితరులున్నారు.  అంటే ఒక కుటుంబం నుంచి ఒక్కరికే ఛాన్స్ అన్న సిద్ధాంతాన్ని పాటించింది కాంగ్రెస్ పార్టీ.  మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ళ పార్లమెంటు సీటు ఇవ్వటం వలన ఆమెకు సీటివ్వలేదు. 

మల్కాజ్ గిరి సీటు కోసం తెదాపాను వదిలి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ ను వదిలి తెరాసలోకి పోయి తిరిగి వచ్చిన ఆకుల రాజేందర్ లకు నిరాశే మిగిలింది.  వాళ్ళకా మల్కాజ్ గిరే కాదు మరే సీటూ దక్కలేదు.
మహిళలకు, ముస్లింలకు అన్యాయం జరిగిందనే ఆవేదనను పార్టీలో చాలా మంది వ్యక్తం చేసారు.  మహిళలకు కేవలం 8 సీట్లే లభించగా ముస్లింలకు నాలుగు సీట్లు లభించాయి.  అయితే ముస్లింలకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కేటాయించకపోవటాన్ని తప్పుపట్టారు.  సీమాంధ్రలోకంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్న ముస్లిం కమ్యూనిటీని పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు.

మొత్తానికి జాబితాను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాత్రం మిగిలిన అగ్ర పార్టీలకంటే ముందే ఉంది. కాకపోతే, వారసులకు టికెట్ రాకపోవటంతో బయటకు అనలేక లోలోపలే ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.  వారసుల సంగతి ఇప్పుడే గుర్తుకొచ్చిందా కాంగ్రెస్ పార్టీకి అని కొందరు నాయకులు మధనపడుతున్నారట!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles