Trs welcome post elections digvijay singh says

TRS welcome post elections Digvijay Singh says, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

TRS welcome post elections Digvijay Singh says

ఎన్నికల తర్వాత తెరాస కాంగ్రెస్ తో కలవొచ్చు!

Posted: 04/11/2014 07:58 AM IST
Trs welcome post elections digvijay singh says

తెలంగాణాలో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఎన్నికల తర్వాతనైనా తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చని అన్నారు.
ప్రతి పార్టీకి తమ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కుందని, వాటిని గౌరవిస్తామని చెప్తూ,  తెరాస ముందు కాంగ్రెస్ లో విలీనం చేస్తామని, తర్వాత పొత్తు పెట్టుకుంటామని చెప్పి చివరకు అవేమీ వద్దనుకోవటం వారి విజ్ఞత, వారిష్టం అన్నారు దిగ్విజయ్ సింగ్.  రాజకీయాలలో ప్రణాళికలు అవకాశాన్ని బట్టి మారటం సహజమే కానీ తమ పార్టీ మాత్రం ఇప్పటికీ అన్న మాటకు కట్టుబడే వుందని, అందువలన ఇప్పటికైనా తెరాసతో పొత్తుకి సిద్ధమేనని అన్నారాయన. 

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రకటించగానే రాజకీయాలలో పెను మార్పులు జరిగాయని, పార్టీలలో అటు నుంచి ఇటు నుంచి అటు వలసలతో పార్టీలలో పునర్వ్యవస్తీకరణలు చోటు  చేసుకున్నాయని అన్న దిగ్విజయ్ సింగ్ తెలంగాణా విషయంలో పూర్తిగా లబ్ధిని పొందటంలో విఫలమైందన్న విషయంలో ఆయన ఏకీభవించలేదు.

తెలంగాణా ప్రజలు అన్నీ గమనిస్తూనేవున్నారని, తెలంగాణాను అడ్డుకునే విషయంలో సోనియా గాంధీ ఏ విధంగా ప్రతి ఎత్తుకీ ఎదురొడ్డి పార్లమెంట్ లో రాష్ట్ర విభజనను సాధించారన్నది అందరికీ కనపడుతూనేవుందని, తెలంగాణా ప్రజలంతా రాష్ట్ర విభజన ప్రక్రియను క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసినంత ఆసక్తిగా టివిల్లో చూసారని, అందువలన కాంగ్రెస్ వలనే తెలంగాణా సాధ్యమైందన్న విషయం అందరికీ తెలుసని చెప్తూ దిగ్విజయ్ సింగ్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందనటంలో సందేహం లేదని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles