Votes for nota in 2013 assembly elections in 5 states

Votes for NOTA in 2013 assembly elections in 5 states, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Votes for NOTA in 2013 assembly elections in 5 states

నోటాను ఎక్కువగా ఉపయోగించిన 25 స్థానాలలో 23 స్థానాలు రిజర్వ్ డ్ సీట్లే.

Posted: 04/19/2014 10:05 AM IST
Votes for nota in 2013 assembly elections in 5 states

అయితే దీనికి కారణమేమిటి అని చూస్తే, ఛత్తీస్ గఢ్ లోని భాజపా అధికార ప్రతినిధి ఇలా అన్నారు- తమ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని,  ట్రైబల్స్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్న భాజపాకి వ్యతిరేకంగా కొందరు అగ్రకులాల వారు ఆ విధంగా నోటాకు వోటేసారు.  రాజస్తాన్ లో ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న జిల్లాలోని మేజిస్ట్రేట్ మాట్లాడుతూ కొందరు ఓబిసి సామాజిక వర్గంవారు చెప్పినదాన్నిబట్టి, ప్రతి ఒక్కరూ ట్రైబల్స్ కే ప్రాముఖ్యతనిస్తున్నారని, అందుకే నోటా బటన్ ని ఉపయోగించామని తెలుస్తోంది అన్నారు. 

ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 630 నియోజకవర్గాలలో 400 జనరల్ సీట్లే. 

సెంటర్ ఫర్ ది డెవలపింగ్ సొసైటీస్ డైరెక్టర్ ఈ విషయంలో ఈ అభిప్రాయాన్ని తిరస్కరించారు.  రిజర్వ్ డ్ స్థానాల్లో కావాలని అలా నోటా బటన్ ని ఉపయోగించటం జరగలేదని, అక్కడి ప్రజల్లో చాలా మంది చదువుకున్నవారు కాదు కనుక పొరపాటున ఒక బటన్ కి మరొకటి నొక్కుతూ అలా నోటా బటన్ ని నొక్కివుంటారని చెప్తున్నారు.  ఒకవేళ అదే నిజమైతే అది మరీ ప్రమాదకరమైన విషయం కాదా.  ఏదో ఒక బటన్ ని నొక్కినట్లయితే వాళ్ళు ఎన్నికలలో సరైన అభ్యర్థిని ఎన్నుకున్నట్లు ఎలా అవుతుంది.  అంటే చదువుకున్నవాళ్ళు ఎక్కువుగా లేని చోట్ల తప్పు బటన్ లను నొక్కుతున్నట్లయితే ఎన్నికలు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలంటే అక్కడ ఇవిఎమ్ లు కాకుండా వేరే విధానాన్ని అవలంబించవలసివస్తుంది. 

అయితే, రిజర్వ్ డ్ స్థానాల్లో ఎస్ సి ఎస్ టి అభ్యర్థులను తిరస్కరించటానికే నోటా బటన్ ని నొక్కుతున్నారనే విషయాన్ని ప్రచారం చెయ్యటం కూడా సరి కాదు.  అది ఇతర ప్రాంతాలలో కూడా తప్పు సంకేతాలనిస్తుంది. 

అందుకే నోటా బటన్ మీద వోటేసిన దానిమీద ఎటువంటి చర్య తీసుకోవలన్నదానిలో ఇంకా స్పష్టత రాలేదు.  ఎంత శాతం నోటా ఉంటే ఏం చెయ్యాలన్న నిర్ణయం జరగలేదు.  ప్రజాస్పందన చూడటానికే నోటా బటన్ ని ప్రవేశపెట్టటం జరిగింది.  అధిక శాతం నోటాకున్నా సరే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అన్న విషయంలో ఎటువంటి నిర్ణయమూ జరగలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles