తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ గత దశాబ్దకాలానికి పైగా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. ఇన్నాళ్ళు ఉద్యమాన్ని పట్టు తప్పకుండా నడిపి, అధికార పార్టీ గుండెల్లో పరెగెత్తించి, తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చే్స్తాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం అని చెప్పిన ఆయన తెలంగాణ ఇచ్చిన తరువాత పార్టీని విలీనం చేయకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తున్నాడు.
ఇన్నాళ్ళు తెలంగాణ కోసం పోరాడినందుకు కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని బలమైన కోరికతో ఉన్నాడు. అందుకే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం లో ప్రజలకు చాలా విషయాలు క్లారిటీగా చెప్పేస్తున్నాడు. ఇన్నాళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చకున్నాం... తనకు అధికారం ఇస్తే ప్రజలకు ఇంకా సేవ చేస్తా, అధికారం ఇవ్వకుంటే ఫాం హౌజ్ లో విశ్రాంతి తీసుకుంటా అని వరంగల్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో ఉన్నట్లు సమాచారం.
నిన్నటి వరకు తెలంగాణలో అన్నిసీట్లు తామే గెల్చుకుంటామని చెప్పుకొచ్చిన ఆయన ఇఫ్పుడు టిఆర్ఎస్ కు తొంభై సీట్లు వస్తాయని సర్వేలు కాని, తనకు వస్తున్న సమాచారం అని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 20 నుండి 30 స్థానాలకు మించి రావని ఆయన అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీలకు ఓట్లేస్తే మురికి కాలువలో వేసినట్లేనని అంటున్నాడు. మరి తెలంగాణ తెచ్చిన నాయకుడిగా పేరున్న కేసీఆర్ కి ప్రజలు అధికారం ఇస్తారో, ఇవ్వరో మరిన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more