Delhi high court agrees to hear pil seeking probe into robert vadra land deals

Robert Vadra, sonia gandhi, priyanka Vadra, Delhi high court, congress party, Congress chief Sonia Gandhi.

Delhi high court agrees to hear PIL seeking probe into Robert Vadra land deals

సోనియా అల్లుడు లెక్కలు తెల్చండి: హైకోర్టు!

Posted: 04/24/2014 03:41 PM IST
Delhi high court agrees to hear pil seeking probe into robert vadra land deals

ఢిల్లీ హైకోర్టు  సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్  వాద్రా ఆస్తులపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.  అత్తగారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం దోపిడీ చేసిన రాబర్డ్ వాద్రా. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ లలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. 

 వాద్రా పెళ్లికి ముందుకు కనీసం కోటీశ్వరుడు కూడా కానీ వాధ్రా గడిచిన పదేళ్లలో మూడు రాష్ట్రాల్లో వేల ఎకరాల భూములు కొన్నారు. కంపెనీలు పెట్టారు. రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ నుంచి అనుచిత లబ్ధి పొందారు. తిన్నంతా తిని, దొరికిన కాడికి దోచుకుని భారతీయులను 'మ్యాంగో పీపుల్ ఇన్ బనానా రిపబ్లిక్' అని ట్విట్టర్ అకౌంట్లో వ్యాఖ్యానించారు. 

లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికాలోని థర్ డ్వరల్డ్ కంట్రీస్ ను బనానా రిపబ్లిక్ అని వ్యవహరిస్తుంటారు. ఉన్న కాసిన్ని సహజవనరులను ఎగుమతి చేసుకుంటూ బండి లాక్కొస్తుంటాయి ఈ దేశాలు. అభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూరిజం అనే పదాలు తెలియని దేశాలివి.

ఇక్కడి ప్రజలని మ్యాంగో పీపుల్ అని అంటారు. బనానా అంటే అరటి పండు, మ్యాంగో అంటే మామిడి పండు. ఇవిరెండూ తప్ప ఇంకేమీ తెలియదనే ఉద్దేశం కాబోలు మ్యాంగో పీపుల్ ఇన్ బనానా రిపబ్లిక్ అనే పదాన్ని సృష్టించారు. ఇలాంటి దేశాలతో మనల్ని వాధ్రా పోల్చారు. సౌదీ అరేబియా, చైనా లాంటి దేశాల్లో అయితే ఈ మాట అన్నందుకు గ్యారంటీగా జైల్లో పెట్టేవారు. 

మన దేశంలో హంతకుల్ని కూడా వదిలిపెట్టేస్తున్న సందర్భమిది. లక్షల కోట్లు మేసేసిన వారిని కూడా నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకు పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి అవగాహన ఉన్న వాధ్రా దేశ ప్రజల్ని అవమానించారు. ఇదేమిటని ప్రశ్నించలేని స్థితిలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆయన ఆస్తులకు సంబంధించి వచ్చిన ఒక పిటీషన్ను విచారించడానికి అంగీకరించింది. 

2009-12లో రూ.10 లక్షలకు 2 వేల ఎకరాల ఆస్తిని కొన్నారని, కొన్న వారంలోనే కేంద్రం ఈ భూములకు రాయితీలు ప్రకటించిందని పిటీషన్ దాఖలైంది. సోలార్ ప్లాంటు పెడతారనే ఉద్దేశంతో ఈ రాయితీలు ఇచ్చారని, తెరవెనుక గోల్మాల్ జరిగిందని పిటీషనర్ కోర్టుకు తెలిపారు.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles