Indian origin businessman beats girl friend and escapes case

Indian origin businessman beats girl friend, Indian origin escapes violence case, Gurbaksh Chahal abetted

Indian origin businessman beats girl friend and escapes case

అరగంటసేపు ఆడ స్నేహితురాలిని వేధించి శిక్ష నుంచి తప్పించుకున్న భారతీయుడు

Posted: 04/26/2014 11:40 AM IST
Indian origin businessman beats girl friend and escapes case

భారత మూలాలుగల అమెరికన్ వ్యాపారి గురుబక్ష్ చహల్ 30 నిమిషాలలో 117 సార్లు తన ఆడ స్నేహితురాలిని కొట్టి, మూడుసార్లు చంపుతానని ఆమెను బెదిరించి, ఆ ఉదంతమంతా వీడియోలో రికార్డైనా శిక్షనుంచి తప్పించుకున్న వార్త సంచలనం రేపింది.

పోయిన సంవత్సరం ఆగస్ట్ లో ఈ కేసులో అరెస్టై మిలియన్ డాలర్ల కట్టి బెయిల్ మీద బయటకు వచ్చిన 31 సంవత్సరాల చహల్ తన మీద ఆరోపణలు అసత్యాలని చహల్ ట్విట్టర్లో అనేక సార్లు పోస్ట్ చేసారు.  16 సంవత్సరాల ప్రాయం నుంచే కంపెనీలను స్థాపించి లాభానికి అమ్ముతూ వస్తున్న ధనికుడు చహల్ తన శాన్ ఫ్రాన్సిస్కో నివాసంలో అతని అనుమతి లేకుండా తీసుకొచ్చిన మహిళా స్నేహితురాలిని కొట్టి హింసించిన సెక్యూరిటీ వీడియో ఫుటేజ్ ని సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టటానికి తగదంటూ కోర్టు దాన్ని కొట్టిపారేసింది.  ఒకే ఒక్క ఆధారం వీడియో ఫుటేజ్ కనుక అతని మీద కేసు కొట్టివేయబడింది. 

ఆగస్ట్ లో అతన్ని అరెస్ట్ చెయ్యటానికి ముందు అతని గర్ల్ ఫ్రెండ్ పోలీస్ అత్యవసర 911 కి ఫోన్ చెయ్యబట్టి అతన్ని అరెస్ట్ చేసి అతని నేరాన్ని నిరూపించటం కోసం అతని నివాసంలోని సెక్యూరిటీ వీడియో ఫుటేజ్ ని పోలీసులు సంగ్రహించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles