Ed registers case on dasari narayana rao

ED registers case on Dasari Narayana Rao, Coalgate scam, Navin Zindal, Zindal companies, Enforcement Directorate case on Dasari

ED registers case on Dasari Narayana Rao

డెబ్భైయ్యో వసంతం దాటగానే దాసరికి షాక్

Posted: 05/06/2014 10:23 AM IST
Ed registers case on dasari narayana rao

తెలుగు సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఆదివారం తన డెబ్భైయ్యో పుట్టినరోజు జరుపుకున్నారు, సోమవారం ఎన్ఫోర్స్ మెంట్ శాఖ (ఈడీ) ఆయనమీద కేసు నమోదు చేసింది.  తనపై మరక పడిందని, దాన్ని తుడవటం పోయి తనమీద మరింత బురద్ చల్లుతున్నారని వాపోయిన దాసరి నారాయణ రావు రెండు రోజుల తర్వాత తన మీద ఏకంగా కేసే నమోదవుతుందని ఊహించలేకపోయారు.  

బొగ్గు క్షేత్రాల కేటాయింపులో జరిగిన కుంభకోణంలో లబ్ధిదారుడైన కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ మీద కూడా కేసు నమోదైంది.  వీరిద్దరి మీదా డబ్బు అక్రమ చెలామణీ కేసు నమోదైంది.  బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇప్పటికే 17 ఎఫైఐఆర్ లను నమోదు చెయ్యగా వాటిని కూడా ఈడీపరిగణనలోకి తీసుకుంది.  

బోగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకల మీద ఈడీ ఇప్పటికే కొన్ని సంస్థల మీద కేసు నమోదు చేసింది.  ఇప్పుడు తాజాగా దాసరి నారాయణ మీద జిందాల్ మీద కేసు నమోదు చేసిన ఈడీ దాసరి నారాయణరావుకి చెందిన సంస్థలలోకి డబ్బు అక్రమ మార్గంలో వచ్చి చేరిందని, అందుకు కారణం జార్ఖండ్ లో జిందాల్ కంపెనీకి బొగ్గు కేటాయించటంలో దాసరి సహకరించటమేనని ఈడీ పేర్కొంది.  

ఇదే కేసుని సిబిఐ లోగడ అవినీతి చట్టం కింద ఆరోపణ చెయ్యగా ఈడి ఆర్థిక లావాదేవీల మీద ఆరోపణలు చేసింది.  ఈ ఆర్థిక లావాదేవీలలో విదేశీ మారక ద్రవ్యం కూడా ముడిపడివుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.  

భారత ప్రభుత్వ ఖజానాకు 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిన బొగ్గు కుంభకోణం కేసును సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చెయ్యబోతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles