Tough fight at amethi

Tough fight at Amethi, Rahul Gandhi touring the Amethi constituency, Rahul wants Amethi winning sure, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Tough fight at Amethi, Rahul Gandhi touring the Amethi constituency, Rahul wants Amethi winning sure

అమేథీలో గట్టి పోటీ, రాహుల్ పర్యవేక్షణ!

Posted: 05/07/2014 11:33 AM IST
Tough fight at amethi

ఈసారి 9 దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ రోజు 8 వ దశలో తెలంగాణా పోను మిగిలిన ఆంధ్రప్రదేశ్ లోను, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, హిమాచల్, ఉత్తరాఖండ్ లలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి.  

ఈరోజు ఎన్నికలలో ప్రముఖంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో పోలింగ్ జరుగుతోంది.  ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజున భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ అమేథీలో సభ నిర్వహించటంతో భాజపా కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ చాలా గట్టిగా సాగుతోంది.  అమేథీ సీటు చెయిజారిపోకుండా ఉండటం కోసం ఆయన తన నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ వోటు వెయ్యమని వోటర్లను ప్రోత్సహిస్తున్నారు.  

ఉదయం పదిన్నర వరకు పశ్చిమ బెంగాల్ లో 24 శాతం, బీహార్ లో 9.5 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో 11.5 శాతం పోలింగ్ నమోదైంది.  

అమేథీలో ఆఆపా అభ్యర్థి కుమార్ విశ్వాస్, మహమూద్ పూర్ పోలింగ్ స్టేషన్లో బూత్ కాప్చరింగ్ జరిగిందని ఎంత చెప్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తపరిచారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles