Stolen golden ornament of padamavathi temple recovered

Stolen golden ornament in Padamavathi temple, Stolen ornament of Padmavathi temple recovered, TTD EO and vigilence investigate stolen ornament

Stolen golden ornament of Padamavathi temple recovered

పద్మావతి అమ్మవారి ఇంటి దొంగ

Posted: 05/09/2014 11:59 AM IST
Stolen golden ornament of padamavathi temple recovered

చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో మూడు రోజుల క్రితం దొంగిలించబడ్డ హారం తిరిగి ప్రత్యక్షమైంది.  

హారం మాయమైన రోజున ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరు దొంగిలించటానికి అవకాశం ఉంటుంది అన్న దాని మీద జెఇవో విజిలెన్స్ అధికారులతో కలసి లోతుగా దర్యాప్తు మొదలు పెట్టగానే ఆరు లక్షల రూపాయాల విలువైన ఆ హారం ఆలయంలో ప్రత్యక్షమైంది.  

దానితో అధికారులూ, అంతటితో దర్యాప్తు ఆగిపోవటంతో సిబ్బంది కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.   

గతంలో కూడా అలాగే దొంగతనానికి పాల్పడి, దర్యాప్తు మొదలవగానే హుండీలో పడవెయ్యటం లాంటి ఘటనలను పద్మావతీ ఆలయంలో చోటుచేసుకున్నాయి.  ఈ పని చేసింది ఇంటిదొంగే అవబట్టి వాతావరణం వేడెక్కి వాళ్ళమీదకు వత్తిడి వచ్చే సందర్భం కనిపించటంతో తిరిగి పెట్టగలగటం కూడా జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles