మోదీ లో మోధ్ అనేది ధనికులకిచ్చిన టైటిల్. మోధ్ బ్రాహ్మణ, మోధ్ బనియా అనేవి ఆ సామాజిక వర్గంలో అత్యంత ధనికులను సంబోధిస్తూ ఇచ్చిన టైటిల్స్ అని, మోదీ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారవటం వలన ఆయన అగ్ర కులానికి చెందినవారవుతారు కానీ వెనకబడ్డ జాతి (బిసి) అని తప్పుగా ప్రకటించుకుంటున్నారని గురువారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వైశ్య కులంలో సబ్ కాస్ట్ అయిన మోధ్ ఘంచి కి చెందిన మోదీ బిసి ఎలా అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన దానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ జవాబిచ్చింది.
పై ఆరోపణలు చేసిన గుజరాత్ లో ఒకప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడైన శక్తి సింహ్ గోహిల్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఆయన చాయ్ వాలా కూడా కాదని, చిన్నప్పుడు ఆయన అంకుల్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ క్యాంటీన్ నడుపుతుంటే మోదీ అప్పుడప్పుడు కూర్చుని పోతుండేవారని అన్నారు. ఇలా బిసి సర్టిఫికేట్ దొంగదే, చాయా వాలా అని చెప్పేది దొంగ మాటే, అదే విధంగా ఆయన చేయించిన దొంగ ఎన్ కౌంటర్ల వలన గుజరాత్ కి చెడ్డపేరు కూడా వచ్చిందని అన్నారాయన.
మోదీ నిజంగానే చాయ్ అమ్మినట్లయితే ఏ బండి మీద అమ్మారు, ఆయన వయసులో ఉన్నవారెవరైనా ఇందుకు సాక్షులు ఉన్నారా అని అడిగారు. మోదీ ముఖ్యమంత్రైన నాలుగు నెలల్లో ఆయన పుట్టిన కులమైన మోధ్ ఘంచి ని ఓబిసి లో కలిపారని, అందుకు స.హ.చట్టం ద్వారా తీసుకున్న డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పిన గోహిల్ మహాత్మా గాంధీ కూడా మోధ్ వానిక్ అని అన్నారు.
మోదీ సంపాదించుకున్న ఓబిసి సర్టిపికేట్ నిజానికి మోసపూరితమైనదని గోహిల్ తేల్చారు.
అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణకు జవాబిస్తూ, మోధ్ ఘంచి అనేది నూనె తీసే కులానికి చెందినవారని, గుజరాత్ సోషల్ వెల్ఫేర్ శాఖ జూలై 25, 1994 చేసిన నోటిఫికేషన్ ప్రకారం 36 సామాజిక వర్గాలున్న ఓబిసి కేటగిరి లో మోదీ కులమైన మోధ్ ఘంచి 25(బి) లో ఉందని గుజరాత్ ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధి నితిన్ పటేల్ అన్నారు.
మోదీ మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసింది 2001-2002 లో కాబట్టి ఆయన ముఖ్యమంత్రైన నాలుగు నెలలలో ఆయన తన కులాన్ని ఓబిసి లో చేర్చారన్న కాంగ్రెస్ అభియోగం తప్పని నితిన్ పటేల్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more