భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాల నుంచి ఒకరి దేశ రాజధానిలో మరొక దేశ నుంచి ఇద్దరు జర్నలిస్ట్ లను నియమించుకోవచ్చు. ఆ విధంగా భారత్ నుంచి లభించిన పాకిస్తాన్ వీసా మీద ద హిందూ తరఫునుంచి మీనా మీనన్, పిటిఐ నుంచి స్నేహేష్ అలెక్స్ ఫిలిప్ ఆగస్ట్ 2013 లో పాకిస్తాన్ వెళ్లారు. మూడు నెలలకోసారి వాళ్లు వీసా రెన్యువల్ కి దరఖాస్తు పెట్టుకోవలసి ఉంటుంది కాబట్టి అలాగే చేస్తూ వచ్చారు.
మార్చి 9 న వీసా గడువు ముగిసే ముందుగానే ఆ ఇద్దరు పాత్రికేయులూ రెన్యువల్ కోసం అప్లై చేసారు. గడువు ముగిసేంత వరకూ ఏ సమాధానమూ రాలేదు. ఆ తర్వాత వీసా ప్రక్రియ కొనసాగుతోందంటూ సమాధానం వచ్చింది. ఆ తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయగానే సమాధానమేమీ రాలేదు కానీ తాజాగా వీసా గడువ అయిపోయి రెండు నెలలైంది కాబట్టి వారం రోజులలో దేశాన్ని విడిచి పొమ్మంటూ ఆ మంత్రిత్వ శాఖనుంచి ఉత్తర్వు వచ్చింది.
ఇద్దరు పాత్రికేయులను ఒకరి దేశానికొకరు పంపించుకునే వెసులుబాటు ఇరు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందం కలిగిస్తున్నా, పాకిస్తాన్ నుంచి మాత్రం పాత్రికేయులెవరూ భారత్ కి వీసా మీద రాకపోవటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more