Distribution of employees of ap secretariat

Distribution of employees of AP Secretariat, First list of division of Secretariat employees, Telangana Employees get Order To Work, Distribution of employees in State level

Distribution of employees of AP Secretariat

తెలంగాణా ఉద్యోగులకు 'ఆర్డర్ టు వర్క్'

Posted: 05/21/2014 10:09 AM IST
Distribution of employees of ap secretariat

స్థానికత ప్రాతిపదిక మీద మంగళవారం నాడు సచివాలయంలోని 32 శాఖలలోను ఉద్యోగుల విభజన జరిగి విడుదలైన ప్రాధమిక జాబితా ప్రకారం 1060 సీమాంధ్ర ఉద్యోగులను, 805 తెలంగాణా ఉద్యోగులను గుర్తించటమైంది.  అందులో ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణ పరిపాలనా శాఖ ఉప కార్యదర్శికి అందజేయవచ్చని, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని ఉత్తర్వులలో పేర్కొనటం జరిగింది.  

తెలంగాణాలో పనిచెయ్యవలసిన ఉద్యోగులకు ఆర్డర్ టు వర్క్ ఉత్తర్వులు అందుతాయి.  ఆంధ్రప్రదేశ్ లో పనిచెయ్యవలసిన ఉద్యోగులకు ఎటువంటి ఉత్తర్వులు ఉండవు.  ఇరు ప్రాంతాల ఉద్యోగులకు మాక్ అడ్మినిస్ట్రేషన్ పేరిట శిక్షణా కార్యక్రమాలుంటాయి.  విభజన వలన ఉద్యోగులలో సందిగ్ధత రాకుండా ఉండటం కోసం వారికి అవగాహనా కార్యక్రమాల ద్వారా ఇరు రాష్ట్రాలలో పని సాఫీగా సాగిపోవటానికే ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.  

ఉద్యోగుల భట్వారా అవుతూనే రభస మొదలైంది.  చూసారా సీమాంధ్ర ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారని చెప్పారు ఎక్కడున్నారు అని సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులంటే, అంతా తప్పుల తడక, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణా జాబితాలో కలిపేసారని తెలంగాణా ప్రాంత ఉద్యోగులు అన్నారు.  

జిల్లా జోనల్ స్థాయిలోని ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే పనిచేస్తారు.  విభజన కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగులలోనే జరుగుతోంది.  

ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో జరిగిన ఉద్యోగుల భట్వారా 25 వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో పూర్తవుతుందని సంబంధిత అధికారాలు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles