చాలా వరకు మీడియాలో నరేంద్ర మోదీని 14 వ ప్రధాన మంత్రిగానే వ్యవహరిస్తున్నారు. కానీ కొన్ని వెబ్ సైట్లు మాత్రం 15 వ ప్రధాన మంత్రిగా పేర్కొంటున్నాయి. వీటిలో ఏది సరైన సంఖ్య?
భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసినవారిలో గుల్జారీ లాల్ నందా కూడా ఉన్నారు. ఆయన రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసారు. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ మరణించినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటానికి మధ్యలో ఒకసారి, లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటానికి మధ్యలో మరోసారి గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆయనను ప్రధానమంత్రులలో కలపకపోతే మోదీ 14 వ ప్రధానమంత్రి అవుతారు, కలిపితే 15 వ ప్రధానమంత్రి అవుతారు.
భారతదేశ ప్రధాన మంత్రులు వీరు-
1. జవహార్ లాల్ నెహ్రూ దాదాపు 17 సంవత్సరాలు ఏకధాటిగా ప్రధానమంత్రిగా పనిచేసారు.
2. గుల్జారీ లాల్ నందా రెండుసార్లు తాత్కాలిక ప్రధాన మంత్రిగా పనిచేసారు. రెండు సార్లు కలిపినా కూడా పట్టుమని పాతిక రోజులే ఆయన ప్రధానిగా వ్యవహరించిన కాలం.
3. లాల్ బహాదూర్ శాస్త్రి రెండు సంవత్సరాలు పనిచేసారు.
4. ఇందిరా గాంధీ- నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు. ఒకసారి 11 సంవత్సరాలు వరుసగా, మరోసారి నాలుగు సంవత్సరాలు పనిచేసారు.
5. మొరార్జీ దేశాయ్ రెండు సంవత్సరాలు పనిచేసారు.
6. చరణ్ సింగ్ కేవలం ఆరు నెలల కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు.
7. రాజీవ్ గాంధీ ఐదు సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించారు.
8. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కేవలం ఒక సంవత్సర కాలం ప్రధాని పదవిలో ఉన్నారు.
9. చంద్రశేఖర్ 8 నెలల కాలం ప్రధాని పదవిలో పనిచేసారు.
10. పి.వి.నరసింహారావు 5 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసారు.
11. అటల్ బిహారీ వాజ్ పేయ్ రెండు సార్లు ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. మొదటిసారి కేవలం 15 రోజులే కానీ రెండవసారి 6 సంవత్సరాలు పనిచేసారు.
12. హెచ్ డి దేవగౌడ 10 నెలలు ప్రధానమంత్రిగా పనిచేసారు.
13. ఐకె గుజ్రాల్ 8 నెలలు పనిచేసారు.
14. డాక్టర్ మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు- పూర్తిగా రెండు టెర్మ్ లలో ప్రధానమంత్రగా పనిచేసారు.
15. నరేంద్రమోదీ 26 న ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు.
ఇలా చూస్తే మోదీ 15 వ ప్రధానమంత్రి, కానీ గుల్జారీ లాల్ నందాని లెక్కలోకి తీసుకోకపోతే 14 వ ప్రధాని అవుతారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత దేశాన్ని ఇంత వరకు నెహ్రూ సంతతివారు పాలించిన కాలం- 33 సంవత్సరాలు. చాలా మంది భావిస్తున్నట్లుగా పరోక్షంగా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లను ప్రధాన మంత్రిగా నిలబెట్టి పాలించిన కాలం 15 సంవత్సరాలు. అంటే 67 సంవత్సరాలలో 48 సంవత్సరాలు నెహ్రూ గాంధీ సంతతివారి కనుసన్నలలోనే దేశం నడిచింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more