Kodandaram against directives to distribute employees

Kodandaram against directives to distribute employees, Article 371 D silent on bifurcation, KCR comments on Seemandhra employees

Kodandaram against directives to distribute employees

మార్గదర్శకాలు ఒప్పుకోం అంటున్న కోదండరాం

Posted: 05/24/2014 01:51 PM IST
Kodandaram against directives to distribute employees

ఉద్యోగుల భట్వారాలో కేంద్రం సూచించిన మార్గదర్శకాలు ఆమోదయోగ్యం కావని తెలంగాణా ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు.  తెలంగాణా ఉద్యోగులు తెలంగాణాలోను, ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాలోనే ఉండటం సబబని అన్న కోదండరాం తెలిసీ తెలియక ఈ విషయంలో మాట్లాడుతున్న చంద్రబాబు మాటలను తప్పు పట్టారు.  ఆర్టికిల్ 371 డి విభజన విషయంలో మార్గదర్శకాలేమీ ఇవ్వలేదని ఆయన అన్నారు.  

ప్రస్తుతం జరుగుతున్న తాత్కాలిక ఏర్పట్లలో కూడా ఇదే పద్ధతిని అవలంబించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు అసంబద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.  

హైద్రాబాద్ లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల విషయంల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ మాటలను, సమర్థిస్తున్న తెలంగాణా ఐకాసను ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తప్పు పట్టారు.  కెసిఆర్ మాటలు తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు మాట్లాడవలసిన మాటలు కావని అన్న రఘువీరా రెడ్డి, ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలందరికీ తాను అండగా ఉంటానని మాటిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles