Tdp to work for good future to youth

TDP to work for good future to youth, TDP Mahanadu starts, people expect good governance Chandrababu says, Work hard Chandrababu gives call in Mahanadu

TDP to work for good future to youth

యవతకు భవిత, రాష్ట్రాభివృద్ధి మంత్రాలుగా తెదేపా!

Posted: 05/27/2014 04:45 PM IST
Tdp to work for good future to youth

ఈరోజు తెలుగు దేశం మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు, పార్టీ విజయాన్ని పార్టీ కార్యకర్తలందరికీ అంకితమిస్తూ, కష్టకాలంలో అందరం కష్టపడి పనిచేద్దాం, క్లిష్ట సమస్యలను పరిష్కరించుకుందాం, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుందామని ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.  

ఎంతో అభివృద్ధి చెందవలన రాష్ట్రం గడచిన పదేళ్ళలో ఎంతో వెనక్కి పోయిందని బాధను వ్యక్తంచేసిన చంద్రబాబు ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకోవాలని, తమలోని ఆలోచనలను స్పష్టంగా పంచుకోవాలని అన్నారు.

తెలుగు దేశం పార్టీకి ఇతర పార్టీలకూ తేడా ఉందని, ఇతర పార్టీలు లూటీచేసినా పట్టించుకోరు కానీ ఏ చిన్న తప్పు చేసినా తెదేపాని గమనిస్తారని చంద్రబాబు హెచ్చిరించారు.  

తెలంగాణాలో సామాజిక న్యాయం సాధించవలసిన అవసరం ఉందని అన్న చంద్రబాబు, తెదేపా జాతీయ పార్టీగా ఎదుగుతున్న తరుణంలో అందరూ మరింత నిష్టతో పనిచెయ్యాలని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles