తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఇక్కడే ఉండాలి.. వచ్చే ఏడాది మాత్రం సీమాంద్రకు వెళ్లాటానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. కొత్త రాజధానికి పయనం ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసిన తరువాతే. ఈలోగా రాజధాని నిర్మాణం పూర్తికి మొగ్గు చూపాలని కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం.
ఇదే అంశాన్ని కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులకూ చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. వాస్తవంగా ఆరు నెలల్లోనే కొత్త రాజధానికి సచివాలయం సహా వెళ్లిపోవాలన్నది చంద్రబాబు ఆలోచన. దీనికోసం సాధ్యాసాధ్యాలనూ పరిశీలించాలని అధికారులకూ ఇటీవల సూచించారు. ముందుగా మంగళగిరి వద్ద తాత్కాలిక క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకుని, తరువాతి కాలంలో పూర్తిస్థాయిలో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇదే సమయంలో కొంతమంది ఉద్యోగులు చంద్రబాబును కలిసి పిల్లల విద్యా సంవత్సరం దెబ్బ తినకుండా ఉండేందుకు ఈ విద్యా సంవత్సరం ముగిసిన తరువాతే కొత్త రాజధానికి తరలివెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనివల్ల పిల్లల చదువుకూ అడ్డంకులు ఉండబోవని బాబు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఉద్యోగుల విజ్ఞప్తితో కొంతవరకు ఏకీభవించినట్టు సమాచారం. మార్చి, ఏప్రిల్ మాసాల్లో పరీక్షలు అయిన తరువాత రాజధానికి వెళ్లేలా చూడాలని కూడా బాబు భావిస్తున్నట్టు సమాచారం. అప్పటిలోగా కొత్త రాజధానిని గుర్తించడం, సచివాలయం, శాసనసభ, శాసనమండలి నిర్మాణాలను పూర్తి చేయడం, అధికారులు, ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించేలా చూడడంవంటి అంశాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకూ దిశా నిర్దేశం చేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more