Chandrababu naidu meets narendra modi to discussion

chandrababu naidu meets narendra modi, Narendra Modi, Chandrababu Naidu, New Delhi, Telugu Desam Party, Telangana, Prime Minister Narendra Modi, bifurcation of Andhra pradesh, national capital to meet Prime Minister .

chandrababu naidu meets narendra modi to discussion

ప్రదాని మోడీతో బాబు గుసగుసలు ఇవే?

Posted: 05/31/2014 11:24 AM IST
Chandrababu naidu meets narendra modi to discussion

ఢిల్లీలో నారా చంద్రబాబు చరిత్ర స్రుష్టించారు. నారా చంద్రబాబు దెబ్బ ఢిల్లీ వాతావరణం ఒక్కసారి ఇసుక తుపాన్ తో.. చేలరేగిపోయింది. ఒక్కరోజులోనే.. కేంద్రంలో ఉన్న మంత్రులతో భేటి అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలటే చంద్రబాబు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేయటం జరిగింది. చంద్రబాబు రాకను గమనించిన ప్రధాని మంత్రి మోడీ
ఏకంగా 15 మంది కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. దాదాపు 20 గంటలపాటు ఆయన వరుస భేటీలు కొనసాగాయి. అయితే చివరికి ప్రధాని మంత్రి మోడీ , చంద్రబాబుల మద్య కొన్ని గుసగుసలు జరిగినట్లు తెలుస్తోంది.

వారిద్దరి మద్య జరిగిన సంభాషణ ఇదే …................

1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలి.

2. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పించాలి.

3. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి.

4. రుణమాఫీల హామీని అమలు చేయడానికి కేంద్రం తన వంతు సాయం అందించాలి.

5. హైదరాబాదును తెలంగాణకు ఇవ్వడంతో... ఏపీకి ఆదాయం లేకుండా పోయింది.

6. తొలి ఏడాది రూ. 13,579 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. దీన్ని తక్షణం సర్దుబాటు చేయాలి.

7. కొత్త రాజధానికి 30 టీఎంసీల నీరు కేటాయించండి.

8. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలి.

9. లోటు బడ్జెట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణతో సమానంగా ఎదిగేవరకు సాయం అందించాలి.

10.ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్లో నేను ఆశలు రేకెత్తించాను. సున్నా నుంచి మొదలు పెట్టి అభివృద్ధి వైపు పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కేంద్రం కూడా చొరవ తీసుకోవాలి.

11. ప్రత్యేక ఏపీ సెల్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

12. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా నిధులు లేవు. ప్రణాళికా సంఘానికి చెప్పి జీతాలకు డబ్బులివ్వండి.

వీటిని పట్టి చూస్తే.. సీమాంద్ర కోసం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నాడో ఇట్టే అర్థమవుతుంది. ఒక సినిమాలో బాలయ్య ఒక డైలాగు గుర్తుకు వస్తుంది. ‘‘చరిత్ర స్రుష్టించాలన్న .. మేమే, చరిత్ర తిరగరాయాలన్న ..మేమే’’ అని చెప్పటం జరుగుతంది. ఇప్పుడు అదే బాటలో.. చరిత్ర తిరగరాస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles