Swiss made solar plane

Swiss made solar plane, Solar Impulse-2 team of Swiss, Bertrand Piccard and Andre Borschberg solar plane makers

Swiss made solar plane

సౌరశక్తితో నడిచే విమానం

Posted: 06/02/2014 05:42 PM IST
Swiss made solar plane

స్విట్జర్లాండ్ లో మొదటిసారిగా సౌరశక్తితో నడిచే విమానాన్ని నడిపారు.  దీనితో ప్రపంచమంతా చుట్టివస్తామంటున్నారు ఆ విమానాన్ని రూపొందించిన ఇంజినీర్లు.  

ఈ రోజు ఉదయం టేక్ ఆఫ్ చేసిన ఈ సోలార్ ఇంపల్స్ 2 బృందం 2 గంటల 17 నిమిషాల పాటు పశ్చిమ స్విట్జర్లాండ్ మీద గాలిలో చక్కర్లు కొట్టారు.  

ఐదు సంవత్సరాల క్రితం సింగల్ సీటర్ సోలార్ విమానాన్ని తయారు చేసారు కానీ, ఇప్పుడు తయారైన విమానం దానికంటే ఎన్నో విధాల మెరుగైనదంటున్నారు.  రాబోయే నెలల్లో మరిన్ని సోలార్ ప్లేన్ లను నడుపుతామని ఆ విమాన బృందం అంటోంది.  

ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణకర్తలైన బెర్ట్రాండ్ పిక్కార్డ్, ఆండ్రే బోర్ష్ బర్గ్ మాటల్లో చెప్పాలంటే దీని 72 మీటర్ల పెద్ద పెద్ద రెక్కల్లో అమర్చిన 17200 సోలార్ సెల్స్ సౌరశక్తితో పూరకం చెయ్యటం ద్వారా ఈ విమానం ఎంతసేపైనా గాలిలో ఎగురుతూ ఉండగలదు.  

ఈ విమానంలో ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్లు వచ్చే సంవత్సరం ప్రపంచమంతా చుట్టివస్తామని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles