ఇందిరా గాంధీ హయాంలో అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో భారత ప్రభుత్వం నిర్వహించిన దాడి జరిగి ఈ రోజుకి 30 సంవత్సరాలయింది. కానీ దాని వలన జరిగిన పరిణామాల వలన చాలా మంది హృదయాల మీద పడ్డ లోతైన గాయాలు ఇంకా మానలేదని ఇప్పటికీ అక్కడక్కడా అడపాతడపా చిన్నగా మొదలై చినికి చినికి గాలివానైన చందంగా బైటపడుతన్న సంఘటనలు తెల్పుతున్నాయి.
ఏమిటీ ఆపరేషన్ బ్లూ స్టార్?
1984 జూన్ 3 నుంచి మొదలై 8 వరకు స్వర్ణమందిరంలో జరిగిన సైనిక దళ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లూస్టార్. ఈ ఆపరేషన్ ని నడిపించింది అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అయితే, అందుకు కారణం అందులో సాయుధ దళాలతో దాగివున్న జర్నాల్ సింగ్ భింద్రన్ వాలా. ఈ ఆపరేషన్ లో భారత సైనిక దళం టాంక్ లు, మందు సామాన్లు, రసాయనిక పేలుడు పదార్థాలు, హెలికాప్టర్లు, గన్ లతో ఉన్న వాహనాలను వాడారు.
ఈ ఆపరేషన్ లో రెండు భాగాలున్నాయి. ఒకటి ఆపరేషన్ మెటల్- స్వర్ణమందిరంలోని హర్మిందర్ సాహిబ్ లో దాగివున్న భిందర్వాలే ని బయటకు లాగటం, రెండవది ఆపరేషన్ షాప్- సమీప గ్రామీణ ప్రాంతంలో దాగివున్నవారిని కూడా బయటకు లాగటం. దీన్ని నడిపించిన లెఫ్టెనెంట్ జనరల్ కులదీప్ బ్రార్, ఈ ఆపరేషన్ లో 83 మంది సైనికులు మరణించారని, 220 మంది గాయపడ్డారని తెలియజేసారు. వాళ్లు కాకుండా, భారత ప్రభుత్వం వెలువరించిన ప్రకటన ప్రకారం 492 మంది నాగరికులు మరణించారు. అనధికారికంగా 5000 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పుకుంటారు.
ఈ ఆపరేషన్ లో కూలిపోయిన అకాల్ తఖ్త్ ని భారత ప్రభుత్వం తిరిగి మరమ్మతులు చేయించి ఇచ్చింది. అందులోని సిఖ్ లైబ్రరీలోని అరుదైన ప్రాచీనమైన గ్రంథ సంపదను ఆ లైబ్రరీ కూలిపోక ముందు సిబిఐ సీజ్ చేసిందట.
జూన్ 8 న హర్మిందర్ సాహిబ్ దాగివున్న భిందర్వాలే మరణించి సైనికులు ఆ మందిరాన్ని స్వాధీనంలోకి తీసుకోవటం జరిగింది.
ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రభావం
ప్రభుత్వం ఆశించినట్లుగా సిఖ్ ఉగ్రవాదైన భిందర్వాలా, అతని బృందమంతా చనిపోయారు, వాళ్ళ ఉగ్రవాద చర్యలన్నీ ఆగిపోయాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా సిక్కుల నుండి నిరసన వెల్లువ వచ్చింది. పవిత్రమైన స్వర్ణదేవాలయంలో సైనికుల ప్రవేశం, కాల్పులు, మారణ కాండను సిక్కు సంఘాలన్నీ నిరసించాయి. బారత చరిత్రలో ఎప్పుడూ లేనిది సైనికులలో ఉన్న సిక్కులు తిరుగుబాటు చేసారు. ఆర్మ్ డ్, సివిల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెలో పనిచేస్తున్న సిక్కులు రాజీనామాలు చేసి వారికి ప్రభుత్వం అంతవరకు అందించిన పురస్కారాలను తిరిగిచ్చేసారు.
ఆ తర్వాత నాలుగు నెలలకు ఇందిరా గాంధీ నివాసంలో ఆమె బాడీ గార్డ్ లలో ఉన్న ఇద్దరు సిక్కులు సత్వంత్ సింగ్, బీంట్ సింగ్ లు ఆమె తన నివాసంలో ఉదయం బయటకు రావటంతోనే ఆమె మీద దగ్గర నుంచే తుపాకులతో దాడిచేసారు. ఆమెను దగ్గరలో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో చేర్చేసరికే ఆమె ఊపిరి ఆగిపోయివుంది.
ఇందిరా గాంధీ మరణవార్త బయటకు వచ్చిన వెంటనే ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా సిక్కుల మీద ప్రజలు ఆగ్రహాన్ని చూపించారు. దొరికినవారిని దొరికినట్లే సిక్కలను ఊచకోత కోసారు. వాహనాల్లో, నివాసాల్లో, తలదాచుకున్న గురద్వారాల్లో సజీవంగా తగులబెట్టారు.
బ్లూస్టార్ సమయంలో పదవిలో ఉన్న ఆర్మీ ఛీఫ్ అరుణ్ శ్రీధర్ వైద్యాని 1986 లో ఇద్దరు సిక్కలు హత్యచేసారు. వాళ్ళిద్దరినీ అక్టోబర్ 1992 లో ఉరితీయటం జరిగింది. అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఆపరేషన్ బ్లూ స్టార్ లో పనిచేసిన వారికి బహుమతీ ప్రదానాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వటాలు చెయ్యటం జరిగింది. శిరోమణి అకాలీ దల్ దగ్గర తన తప్పు ఒప్పుకున్న జైల్ సింగ్ తన తప్పిదానికి శిక్షగా స్వర్ణమందిరాన్ని సందర్శించటానికి వచ్చిన భక్తుల చెప్పులను శుభ్రం చేసారు.
ఎవరీ భింద్రన్ వాలా, ఉగ్రావాదానికి ఎందుకు ఒడిగట్టాడు?
సిక్కుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నామంటూ మొదలుపెట్టిన జర్నాల్ సింగ్ భింద్రన్ వాలా మొదట్లో భారత భూభాగం నుంచి ఖాలిస్తాన్ అనే పేరుతో సిక్కల ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చెయ్యాలని పట్టుబట్టలేదు. అది రాను రాను పుంజుకుంది. ఖాలిస్తాన్ మ్యాప్ లు కూడా పంచిపెట్టటం జరిగింది. కానీ భింద్రన్ వాలా మీడియా చెప్పినట్లుగా, ఇందిరాగాందీ ప్రచారం చేసినట్లుగా ప్రత్యేక ఖాలిస్థాన్ ఆందోళనకోసం పనిచెయ్యలేదని అంటారు.
1980 లో భిందర్వాలే స్వర్ణమందిరంలోని హర్మిందర్ సాహిబ్ ని తన నివాసంగా చేసుకోవటానికి కారణం ఆయన మీద నిరంకారీ గుర్బచన్ సింగ్ హత్యారోపణ పడటం వలన. 1978లో నిరంకారీ బాబా గుర్బచన్ సింగ్ తన ప్రవచనంలో 10 వ గురువైన గురు గోవింద్ సింగ్ గురించి తక్కువచేసి మాట్లాడారట. దానితో ఆగ్రహించిన అఖండ కీర్తని జఠా బాబా గుర్చరణ్ సింగ్ కి వ్యతిరేకంగా శాంతి మార్చి చేసారు. పోలీసులు వారిమీద కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో భిందర్వాలా కి చెందినవారు ఇద్దరు, 11 మంది అఖండ కీర్తని జఠాకి చెందినవారు మొత్తం 13 మంది మరణించారు.
ఆ తర్వాత భిందర్వాలా మొత్తం 600 మంది సాయుధులైన అనుచరులతో స్వర్ణమందిరంలో నివాసం ఏర్పరచుకున్నారు.
భింద్రన్ వాలా పునరుద్ధరించబోయిన ఆనందపూర్ రిజొల్యూషన్
పంజాబీ మాట్లాడేవాళ్ళకోసం ఏర్పడ్డ పంజాబ్ లో 1966 లో అకాలీ దల్ అధికారంలోకి వచ్చింది. కానీ 1971 లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 13 లోక్ సభ సీట్లను, 1972 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 117 సీట్లలో కేవలం 24 సీట్లనే అకాలీ దల్ సంపాదించటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1972లో ఈ ఓటమిని అధ్యయనం చెయ్యటానికి శిరోమణి అకాలీ 12 మంది సభ్యులతో ఒక సబ్ కమిటీని వేసింది. అందులో సుర్జిత్ సింగ్ బర్నాలా ఒకరు. ఆ సమావేశంలో దల్ కార్యక్రమాలను మెరుగుపరచి సిద్దాంతాలను రూపుదిద్దవలసిందిగా ఆనందపూర్ సాహిబ్ రిజొల్యూషన్ 1973 పేరుతో ప్రకటించారు. అయితే అది కాలాంతరంలో మరుగునపడింది.
భింద్రన్ వాలా నిజానికి అందరూ మర్చిపోయిన ఆనందపూర్ రిజొల్యూషన్ ని పునరుద్ధరించ జూసాడు. దాని ప్రకారం పంజాబ్ లో అధికారాన్ని అకాలీదల్ దక్కించుకోవటం, రాజధాని చండీగఢ్ ని పంజాబ్ కే అప్పగించటం లాంటి నిర్ణయాలున్నాయి. శిరోమణి అకాలీ దళ్ ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి సిక్కు మతాన్ని ప్రచారం చెయ్యటం తన బాధ్యతగా తీసుకుంది.
భింద్రన్ వాలా ఇందిరాగాంధీతో టచ్ లోనే ఉండేవాడు. ఆనందపూర్ రిజొల్యూషన్ మళ్ళీ జీవం పోసుకోవటమంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి బయటకు పోవటమే. అందువలన ఇందిరా గాంధీ భిందర్వాలే నే బయటకు వెళ్ళగొడదామని చూడటం జరిగింది. దాని ఫలితమే పంజాబ్ లో అంత మారణహోమం, పవిత్రమైన దేవాలయంలో సైనికులు చొరబడటం, చివరకు ఇందిరాగాంధీయే బలవటం. అంతటితో ఆగిపోలేదు. ఇందిరా గాంధీ మరణంతో చెలరేగిన హింసాకాండ ఢిల్లీలో 3 రోజుల పాటు వేలాదిమంది సిక్కులను పొట్టనబెట్టుకుంది. ఆ గాయాలు వారి మనసుల మీద చెరగని ముద్రవేసి ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుతున్నాయి.
అటువంటి ఇందిరా గాంధీ తర్వాత వచ్చిన ఆమె కుటుంబీకులు కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసమే పాటుపడ్డారు కానీ ఎప్పుడూ జరిగిన దానికి బాధ్యతను వహించి ఆ గాయాలను తుడిచే ప్రయత్నం చెయ్యలేదు. అవన్నీ మర్చిపోయి వీలయినప్పడల్లా నరేంద్ర మోదీ మీద గుజరాత్ అల్లర్లను రుద్దటానికే ప్రయత్నం జరిగింది.
ఇందిరా గాంధీ ప్రభుత్వం చెప్పిన విషయాలు
ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పంజాబ్ లో కర్ఫ్యూ, మీడియా బ్లాకేజ్ లు జరిగాయి. పంజాబ్ పూర్తిగా ప్రపంచం నుంచి మూడు రోజులు సంబంధం తెగిపోయివుంది. టివిల్లో ఉగ్రవాది భింద్రన్ వాలా స్వర్ణమందిరంలో దాక్కుని ఉండటం వలన, ఖాలిస్థాన్ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తిగాల దేశాన్ని ఏర్పాటు చెయ్యాలన్న ఉద్దేశ్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉండటం వలన గత్యంతరం లేక స్వర్ణమందిరంలో సైనికులను ప్రవేశపెట్టవలసివచ్చిందని చెప్పటం జరిగింది. అందుకు వీడియో క్లిప్పంగ్ లలో స్వర్ణమందిరాన్ని భిందర్వాలే అనుచరులు ఎలా కోటలా మలుచుకున్నారు, ఎంత మందు గుండు సామాను పేలింది, ఎందరు జవాన్లు మరణించారన్నది చూపించారు.
అంటే, రాజకీయానికి భింద్రన్ వాలా ను మతోన్మాదిని చేసి, యుద్ధం చేయటం కోసం అతన్ని దేశద్రోహిని చేసిన ఘనత, ఇందిరా గాంధీ మీద ప్రతీకారం తీర్చుకున్నందుకు సిక్కులందరి మీద ప్రతిఘటనను నిర్వహించిన ఘనత మన రాజకీయనాయుకలకే దక్కింది.
మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది అని తరచి చూసి కేంద్రస్థానానికి పోతే అక్కడ కనిపించేది ఒకటే కారణం. ద్రౌపదికి జరిగిన అవమానం, అభద్రతా భావం. ఆపరేషన్ బ్లూస్టార్ వెనకనున్న కీలకమైన విషయమేమిటా అని చూస్తే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పోగొట్టుకునే సంకేతాలు కనపడటం అంటే నమ్ముతారా?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more