Apple starbucks companies face probe on tax evasion

Apple Starbucks Companies face probe on tax evasion, European Commission to probe tax evasions by companies, Apple says it fulfilled tax provisions, Starbucks says it fulfilled tax provisions

Apple Starbucks Companies face probe on tax evasion

ఆపిల్ స్టార్బక్స్ ల పన్ను ఎగవేతల మీద దర్యాప్తు

Posted: 06/13/2014 05:14 PM IST
Apple starbucks companies face probe on tax evasion

వచ్చే ఆదాయం మీద పన్నును ఒక శాఖ నుంచి మరో శాఖకు ముఖ్యంగా మరో దేశంలోని శాఖకు బదలాయించటమనేది మామూలుగా పెద్ద పెద్ద సంస్థలలో జరిగేదే.  ఉదాహరణకు ఒక దేశంలో తయారైనవాటిని అదే సంస్థ మరో దేశంలో ఉన్న తన సొంత కంపెనీ శాఖకు రవాణా చేసేటప్పుడు పన్ను కూడా ఆ ఉత్పాదనలు రవాణా అయిన దేశానికే వెళ్ళిపోతాయి.  అందులో రవాణా బిల్లు మాత్రమే తయారు చెయ్యబడుతుంది.  ఇది వస్తువులు లేక సేవల మీద వర్తిస్తుంది.  

ఆపిల్, స్టార్బక్స్, గూగుల్, అమెజాన్ సంస్థలు ఈ తంతులో పన్నుని ఆయా దేశాలకు సరిగ్గా చెల్లించక ఐరిష్, డచ్ ప్రభుత్వాల సహకారంతో నేరం చేస్తున్నాయేమో అనే అనుమానంతో యూరోపియన్ కమిషన్ బుధవారం నాడు ఈ విషయంలో లోతుగా శోధించటం కోసం పూనుకుంది.  

ఈ సందర్భంగా యూరోపియన్ యాంటీ ట్రస్ట్ ఛీఫ్ జోక్విన్ అల్మూనియా మాట్లాడుతూ, యూరోపియన్ దేశాలలోని పబ్లిక్ మనీ పరిస్థితి క్లిష్టంగా ఉందని, అందువలన మల్టీనేషనల్ కంపెనీలు తమ వాటా పన్నులను నిజాయితీగా చెల్లించటం చాలా అవసరమని అన్నారు.  

ట్రాన్స్ ఫర్ ప్రైసింగ్ అనే వెసులుబాటు అవినీతికి, చట్టవిరుద్ధంగా నడుచుకోవటానికి కూడా వెసులుబాటు కలిగిస్తోందని యూరోపియన్ కమిషన్ భావిస్తోంది.  ఉదాహరణకు కార్పొరేట్ టాక్స్ 12.5 శాతం ఉండగా, ఆపిల్ సంస్థ ఐర్లాండ్ లోని తన అనుబంధ సంస్థల లాభాల మీద 2 శాతం మాత్రమే చెల్లించింది.  ఆపిల్ లాంటి సంస్థలు విదేశాలలో ఉన్న రాయితీలను ఉపయోగించుకుని అక్కడే ఎక్కువ లాభాలను చూపించటం ద్వారా చట్టంలోని లోపాలను తమ ప్రయోజనానికి మలుచుకుంటున్నాయని టాక్స్ నిపుణులంటున్నారు.  

అయితే ఆ కంపెనీలు మాత్రం తాము కట్టవలసిన పన్నును పూర్తిగా కడుతున్నామని అంటున్నాయి.  ఆపిల్ కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, 2007 లో ఐపాడ్ ని లాంచ్ చేసిన దగ్గర్నించి ఐర్లాండ్ లోని అమ్మకాల మీద పన్నులు 10 రెట్లు పెరిగాయని, విజయమనేది చేసే కృషి మీద ఆధారపడివుంటుంది కానీ ఐరిష్ ప్రభుత్వం తమకేమీ ప్రత్యేకమైన రాయితీలను ఇవ్వలేదని అన్నారు.

నెదర్ ల్యాండ్ లోని కాఫీ రోస్టింగ్, యూరోపియన్ ప్రధాన కార్యాలయం ద్వారా జరిగిన లావాదేవీల మీద స్టార్ బక్స్ పన్ను ని సరిగ్గా చెల్లిస్తుందా లేదా అన్నది కూడా యూరోపియన్ కమిషన్ దర్యాప్తులో భాగమే.  అయితే అధికార ప్రతినిధి కూడా తమ సంస్థ పన్నుకి సంబంధించిన చట్టాలను, అంతర్జాతీయ నియమావళిని పాటిస్తున్నామని చెప్పారు.

తామేమీ యూరోపియన్ చట్టాలను అతిక్రమించలేదని, యూరోపియన్ కమిషనే చేసే దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని ఐరిష్ ప్రభుత్వం ప్రకటించింది.  ఈ విషయంలో ఐరిష్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, మీరు చెప్పిన సంస్థలు ప్రత్యేక సదుపాయాలేమీ పొందలేదని, వాళ్ళకి ప్రత్యేకంగా పన్ను విధానాన్నేమీ అమలుచెయ్యలేదని ప్రకటించింది.

వోటర్ల నుంచి వస్తున్న వత్తిడి దృష్ట్యా, యూరోపియన్ దేశ నాయకులు పన్ను ఎగవేత వేసే సంస్థల మీద ప్రత్యేక దృష్టిని సారించే పనిలో పడింది.  దాని ప్రభావం సంస్థలమీద పడుతోందని తెలుస్తోంది.  స్టార్బక్స్ చేసిన ఒక ప్రకటనలో, తమ ప్రధాన కార్యాలయాన్ని ఆమ్ స్టెర్డమ్ నుంచి లండన్ కి మార్చి, ఏప్రిల్ నుంచి యుకె కి ఎక్కువ పన్ను చెల్లిస్తామని తెలియజేసింది.  అంతర్వ్యవస్థ కార్యకలాపాల్లో చెల్లించిన రాయల్టీ మీద కూడా ఆ సంస్థ రాయితీని క్లెయిమ్ చెయ్యటం మానేసింది.  అంతే కాకుండా 2013, 2014 సంవత్సరాలకు అదనపు పన్నుగా 20 మిలియన్ల పౌండ్లను చెల్లిస్తామని కూడా వాగ్దానం చేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles