Jumbo jets for billionaires

jumbo jet planes, jumbo jets for billionaires, jumbo jet aeroplanes for billionaires, the super jumbo jets for saudi and russian lavish peoples, jumbo jet planes for lavish people

Jumbo Jets for billionaires

ఆకాశంలో ‘‘స్వర్గవిహారం’’

Posted: 06/17/2014 06:57 PM IST
Jumbo jets for billionaires

(Image source from: Jumbo Jets for billionaires)

సాధ్యం కానిదంటూ ఏదీ వుండదని మానవుడు తన మేధాశక్తితో ప్రపంచంలో కొత్త కొత్త రకాల పరికరాలను సృష్టిస్తూ సంచలనం రేపుతున్నాడు. ఆనాడు రాతియుగంలోనే కేవలం రాళ్లనుంచి అగ్గిని కనుగొని తన శక్తిని నిరూపించుకున్న  సామాన్య మానవుడు... నేడు ఆధునికయుగంలో కూడా విమాన మార్గం ద్వారా ఆకాశంలో విహరిస్తూ చంద్రమండలంలో కాలుమోపి చరిత్రను సృష్టించాడు. నేటి సమాజంలో వున్న మానవునికి అనుగుణంగా కావలసిన అవసరాలను పసిగట్టి కొత్త మార్గాలను నిర్మించడంలో ముందున్నాడు.

అలాగే తాజాగా మన భూ ప్రపంచంలోనే అత్యంత ఆస్తులను కలిగి వున్న వారికి అనుకూలమైన సౌకర్యాలను కల్పిస్తూ... అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేస్తూ జంబో జెట్లు అనే ప్రైవేటు వాణిజ్య విమానాలను తయారుచేస్తున్నారు. సహజంగానే డబ్బు ఎక్కువగా వున్నవారు అంతగా ప్రాముఖ్యతలేని సహజమైన పరికరాలను గానీ, పద్ధతులను గానీ అంతగా పట్టించుకోరు. స్నేహితులతో, తోటి ఉద్యోగస్తులతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. దాంతోపాటు ప్రయాణాల్లో కూడా ఎటువంటి లోటు రాకుండా అన్ని సదుపాయాలు వున్న వాణిజ్య విమానాలనే ఉపయోగించాలని భావిస్తారు. అటువంటి వారి కోసమే అంతగా ప్రాముఖ్యత లేని విమానాల తయారీదారులు ఇప్పడు వారికి భావాలను వ్యక్తికరించి లగ్జరీ లీనియర్ కలిగిన వాణిజ్యపరమైన విమానాలను తయారుచేస్తున్నారు.

వైర్డు రిపోర్టుల ప్రకారం... 747, A380 వంటి జెంబో జెట్ విమానాల తయారీదారులు సౌదీ రాజులు, రష్యన్ ఒలిగార్చ్స్ ల అవసరాలను బట్టి, వారి రుచికి తగ్గట్టుగా సరిపోయేందుకు విమానాలను వ్యక్తిగతీకరించడంలో తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. బిలియనీర్ల మీద నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మిడిల్ ఈస్టెర్న్ ఆయిల్ మ్యాగ్నెట్స్, చైనీస్ కేప్టెన్స్ ఇండస్ట్రీ వారు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం డజన్ల కొద్దీ సమూహాలుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారని తేలింది. దాంతో వారికి అనుగుణంగా ‘‘ఎయిర్ బస్’’ను తయారుచేయడం జరిగింది. అదే ఒక సాధారణ వ్యక్తి ప్రయాణించే వాణిజ్య జెట్ లా కాకుండా వీటిలో ప్రత్యేకించి రీ-డెకొరేటెడ్ చేయబడిన డైనింగ్ టేబుల్స్, తోలు కుర్చీలు, మాస్టర్ బెడ్ రూములు, వినోద కేంద్రాలు ఎంతో ఆహ్లాదకరంగా వుంటాయి.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/jumbojet

ఈ విధంగా లగ్జరీ లైనర్ తో తయారుచేయబడిన ఈ లావిష్ విమానాలలో ఖర్చులు కూడా చాలానే వుంటాయి. అయితే ఇవి బిలియనీర్స్ కి మాత్రం ఒక సాధారణమైన విషయం మాత్రమే. వైర్డు రిపోర్టుల ప్రకారం వీటిలో ధరలు ఈ విధంగా కేటాయించబడి వుంటాయి. ప్రస్తుత ప్రైవేటీకరణతో నిర్మించబడిన 737 జంబో జెట్ లో ప్రయాణం కోసం 80 డాలర్లు వెచ్చించాల్సి వుంటుంది. అదేవిధంగా దానికన్నా కొంచెం ఆధునిక పరికరాలను కలిగి, విలాసవంతమైన బెడ్ రూంలు కలిగి వున్న 747 జంబో జెట్ లో అయితే 280 డాలర్ల వరకు టికెట్టుకు డబ్బును వెచ్చించాల్సి వుంటుంది. ఇక వీటన్నిటికన్నా మించిన డబుల్ డెక్కర్ ఎయిర్ బస్సులో ప్రయాణం చేయాలంటే ఏకంగా 300 డాలర్ల వరకు టికెట్టు ఖరీదు చేయాల్సి వుంటుంది.

వైర్డు రిపోర్టుల ఆధారంగా తెలిసిందేమిటంటే... ఎయిర్ బస్సు వారు తమ శాఖను తెరవడం కోసం 1997వ సంవత్సరంలో 170 వరకు ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేసింది. ఎందుకంటే... వాటిని కొనుగోలు చేసే ప్రతిఒక్క ప్రయాణికుడు ఆకాశంలో విహరించేందుకు విస్తృతమైన అవకాశాలను వినియోగించుకోవడానికి అనుకూలంగా వుండటం కోసం ఆ సంస్థ ఇలా చేసింది. ఈ సందర్భంగా ఎయిర్ బస్ మార్కెటింగ్ డైరెక్టర్ అయిన డేవిడ్ వేలుపిళ్లై మాట్లాడుతూ... ‘‘ఏ విధంగా అయితే బిలియనీర్లు తమ రోజువారి జీవితాన్ని ఆఫీసులలోగానీ, ఇళ్లలోగానీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారో.. అదేవిధంగా ఈ విమానాల్లో కూడా గాల్లో విహరిస్తూనే గడపవచ్చు. అలాగే ఏం కావాలన్న ఇందులో పొందవచ్చు. వారు తమ ఖర్చులో కేవలం కొద్దిమేరకు మాత్రమే ఖర్చుపెట్టి ఆఫీసు లేదా ఇంటి వంటి వాతావరణాన్ని పొందవచ్చు’’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అలాగే ‘‘మా మార్కెటింగ్ సంస్థ మిలియనీర్స్ కోసం తయారుచేయబడింది కాదు.. ప్రత్యేకంగా బిలియనీర్ల కోసమే నిర్వహించినది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విమానాల్లో అన్ని విలాసవంతమైన వస్తువులతో పాటు గృహంలో వున్న అన్ని సదుపాయాలు బిలియనీర్ల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి.

picture source : dialymail.co.uk

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles