Aravind kejriwal requesting delhi people to give him cm seat again

Aravind kejriwal requesting delhi people to give him cm seat again, aravind kejriwal latest news, aravind kejriwal speeches in delhi, aravind kejriwal party symbol, aam aadmi party symbol, aam aadmi party news, aravind kejriwal news, aravind kejriwal asking people to give him cm seat again

Aravind kejriwal requesting delhi people to give him cm seat again

ఢిల్లీ చీపురుతో బాదుకుంటున్న కేజ్రీవాల్

Posted: 06/23/2014 02:54 PM IST
Aravind kejriwal requesting delhi people to give him cm seat again

(Image source from: Aravind kejriwal requesting delhi people to give him cm seat again)

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు.. వారి అన్యాయాలను, అక్రమాలను బట్టబయలు చేసి.. ఢిల్లీ నగరవాసులకు ఒకేఒక్క నాయకుడిగా నిలిచాడు. దాంతో ఢిల్లీ ప్రజలందరూ కేజ్రీవాల్ ను నెత్తిన పెట్టుకుని పూజించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కేవలం 28 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటికీ... కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎం కూర్చిలో కూర్చొని అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడు. దీంతో కేజ్రీవాల్ పేరు యావత్తు భారతదేశం మొత్తం మీద ‘‘ఒకే ఒక్కడు’’ సినిమాలో నాయకుడిగాలాగా పేరు సంపాదించుకున్నాడు.

ఒక నెల వరకు ఢిల్లీ అధికారాన్ని పాలించిన కేజ్రీవాల్ ప్రభుత్వం... అసెంబ్లీలో లోక్ పాల్ బిల్లు పాసవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో ముందూవెనుక ఆలోచించకుండా ఆవేశంతో రాజీనామా ఇచ్చిపారేశాడు. అయితే ఇలా చేస్తే దేశం మొత్తం మీద వున్న ప్రజలు తనకే మద్దతు ఇస్తారని భావించిన కేజ్రీవాల్ కి... మొండిచెయ్యే మిగిలింది. ప్రతిపక్ష నాయకుల నుంచి మద్దతునిచ్చిన ఢిల్లీవాసులదాకా అందరూ ఆయన మీద విమర్శలజల్లులు కురిపించారు. కొంతమంది అయితే చెంప ఛెళ్లుమనిపించారు. ఇక చేసేదేమీ లేక అధికార పార్టీల మీద విమర్శలు చేస్తూ, ఉద్యమాలు నిర్వహించుకుంటూ వుండిపోయాడు.

ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ అదే ఢిల్లీ నగరవాసుల దగ్గరకు వెళ్లి అధికార పీఠం కోసం అడుక్కుతినడం మొదలుపెట్టాడు. నాకు ఇంకో ఐదు సంవత్సరాలవరకు అధికారం ఇవ్వండిరా బాబోయ్... అంటూ వీధివీధిన ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ‘‘నాకు ఐదు సంవత్సరాలవరకు ఢిల్లీ అధికారంలో తిరిగి రప్పిస్తే... అసలైన దేశ సేవ ఏంటో నిరూపించుకుంటాను. ఇంతకుముందు నేను రాజీనామా చేయడం తప్పేనని నేను ఒప్పుకుంటున్నాను. అందుకు నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఇక ముందునుంచి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, విధినిర్వహణలో పొరపాటు చేయకుండా వుంటానని మాటిస్తున్నాను’’ అని వేడుకున్నాడు.

అలాగే ‘‘గతంలో జరిగిన విషయాలు మర్చిపోయి నన్ను మళ్లీ ఢిల్లీ అధికార పీఠాన్ని నాకు కల్పిస్తారని నమ్ముతున్నాను. మీరు కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను’’ అని తన చీపురుతో తానే బాదుకుంటూ... ఢిల్లీ నగరవాసులకు అధికారం కోసం అడుక్కోవడం మొదలుపెట్టేశాడు కేజ్రీవాల్. దీనికి ఢిల్లీ నగరవాసులు ఎటువంటి జవాబు ఇస్తారోనని ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles