తెలంగాణాలో చదువుకుంటున్న విద్యార్థులకు కాకుండా, తెలంగాణాల విద్యార్థులకే ఫీజు రియంబర్స్ మెంట్ చేస్తామని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆరాష్ట్ర ప్రభుత్వమే ఫీజులను చెల్లించాలన్న మాటను ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా అంగీకరించారు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని కూడా మాటిచ్చారు. కానీ తెలంగాణా విద్యార్థులుగా ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్ మెంట్ పొందాలంటే స్థానికతను నిరూపించుకోవాలన్న నియమంలో, విద్యార్థులే కాదు వాళ్ళ తండ్రి కూడా తెలంగాణాలో పుట్టివుంటేనే అర్హత లభిస్తుందని చెప్పటాన్ని విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అంటే ఇంటిపేరిచ్చిన కన్నతండ్రే తెలంగాణా విద్యార్థులకు స్థానికతను కూడా సంప్రాప్తించేట్టు చేస్తాడన్నమాట. ఉద్యమం 60 సంవత్సరాల కాక మరిన్ని సంవత్సరాలదైయ్యుంటే తండ్రే కాదు తాత కూడా తెలంగాణాలో పుట్టివుంటేనే స్థానికత అని అనుండేవారా అని ప్రశ్నిస్తున్నారు.
ఒకప్పుడు ముల్కీ సర్టిఫికేట్ అని తెలంగాణా ప్రాంతంలో అమలులో ఉండేది. ముల్క్ అంటే సొంత ప్రాంతం. ముల్కీ అంటే ఆ ప్రాంతానికి చెందినవాడు అని అర్థం. నిజామ్ 1919 లో ఇచ్చిన ఫర్మానా ఆధారంగా ఆర్టికిల్ 371 డి లో ముల్కీ నియమాల ప్రస్తావన జరిగింది. ముల్కీ నియమం ఆ తర్వాత కాలంలో అనవసరమైనదంటూ ఎత్తివేయటం జరిగింది కానీ ఆ ముల్కీ నియామనలే పరిశీలిస్తే ఒక వ్యక్తి ముల్కీ అనాలంటే ఈ క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
1. హైద్రాబాద్ స్టేట్ లో పుట్టివుండాలి.
2. హైద్రాబాద్ స్టేట్ లో జీవిస్తూ వుండాలి. లేదా
3. పుట్టిన సమయానికి అతని తండ్రి హైద్రాబాద్ స్టేట్ లో 15 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండివుండాలి.
4. ముల్కీ కి భార్యైనా అయ్యుండాలి.
5. 15 సంవత్సరాలు హైద్రాబాద్ స్టేట్ లో జీవిస్తూ తిరిగి వెళ్ళకుండా ఇక్కడే నివాసం ఉండే ఆలోచనతో ఉండాలి.
పైన ఎక్కడా తండ్రి ముల్కీ అయితేనే పిల్లవాడు ముల్కీ అన్న నిబంధన కనపడదు. పై నియమాల ఆధారంగా పై చదువులకు, ప్రభుత్వ కార్యాలయాలలో కొలువులకు ముల్కీ సర్టిఫికేట్ ని తీసుకుని దాఖలా చేసేవారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more