Snake wine fruit bat soup

snake wine fruitbat soup

snake wine fruitbat soup

స్నేక్ వైన్.. గబ్బిలాల సూప్..!

Posted: 06/30/2014 05:52 PM IST
Snake wine fruit bat soup


పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి..! ఈ సామెత ఎక్కడో విన్నట్లుంది కదా..? ఎవరైనా మరీ డిఫరెంట్ గా ఉన్నపుడూ.. అందరు చేసే దానికి పూర్తి రివర్స్ లో ఆలోచించే వాళ్లనుద్దేశించి ఈ సామెత వాడుతుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ గురించి చదివితే.. ఈ సామెత వీళ్ల కోసమే కనిపెట్టారని అనుకుంటారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతి భయంకరమైన ఫుడ్ ఐటమ్స్ ఈ జనాలు తీసుకుంటుంటారు. అవి చూస్తే తినడం తర్వాతి సంగతి కాని.. భయం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అవేటింవో.. జర లూక్కేయ్యండి?

snake-wine

స్నేక్ వైన్ :
ఆల్కహాల్ తాగేవారు మరింత డిఫరెంట్ గా ఆలోచించి.. స్నేక్ వైన్ తయారు చేశారట. రైస్ వైన్ లో లేదా ధాన్యంతో తయారు చేసిన ఆల్కహాల్ లో పాములను నానబెట్టి తాగుతారు. చైనా, వియత్నాం.. సౌత్ ఈస్ట్ ఏరియాలో ఈ వైన్ తాగుతుంటారు.

fruitbat-soup

ఫ్రూట్ బ్యాట్ సూప్ :

గబ్బిలాల గురించి తెలుసు కదా. గబ్బిలాలను, పండ్ల రసాలతో కలిసి సూప్ గా చేసుకొని పలావ్ ప్రాంతంలో తాగుతుంటారు. ఇది తాగాలంటే చాలా ధైర్యం ఉండాలి.

balutబాలుట్ :

బాతు గుడ్లలో అప్పుడప్పుడే పిండం తయారవుతున్న గుడ్లను ఉడకబెట్టి తినడం ఫిలిప్పీన్ వాసులకు భలే ఇష్ట పడతారు.

tuna-eyeballs


టూనా ఐబాల్స్ :
టూనా ఫిష్ నుంచి ఈ డిష్ ను తయారు చేస్తారు. టూనా ఫిష్ కనుగుడ్లను ఉడికించి తింటుంటారు. చైనా, జపాన్ లో బాగా ఇష్టపడతారు.

sannakji

సన్నాక్జి :
సన్నాక్జి అనేది కొరియన్ డిష్. బతికున్న ఆక్టోపస్ లను చిన్న చిన్న పీస్ లుగా కట్ చేసి పచ్చి గానే తింటారు. అప్పుడే కట్ చేసి ఉండటం వల్ల ప్రాణం పోని ఆ ముక్కలు కదులుతుంటాయి. అయినా ఆరగిస్తుంటారు అక్కడి భోజన ప్రియులు.

blood-soup

బ్లడ్ సూప్ :
షాంఘై, పోలాండ్, ఫిలిప్పీన్స్, కొరియా, సింగిపూర్ దేశాల్లో కోళ్లు, బాతులు, పందులు, పశువుల బ్లడ్ తో సూప్ తయారు చేస్తుంటారు. చూడ్డానికే ఇబ్బందిగా ఉండే ఈ సూప్ ను వాళ్లు మాత్రం లట్టీలు కొట్టుకుంటూ తాగుతారట.

smalahove

స్మలహొవ్ :
స్మలహొవ్ అనేది వెస్ట్రన్ నార్వే డిష్. గొర్రె తలను ఉడికించి లేదా, స్టీమ్ చేసి దానికి మరిన్ని ఐటమ్స్ తో కలతిపి తింటుంటారు. జనరల్ గా క్రిస్మస్ కు ముందు ఈ ఫుడ్ బాగా తింటుంటారు.

scorp-pops


స్కార్పియాన్ చాకొలెట్స్ :
తేలుతో చాకొలెట్స్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా..? తేలును మధ్యలో ఉంచి లాలి పాప్ లు తయారు చేస్తారు. ఇవి చాలా స్వీట్ గా ఉంటాయని చెబుతుంటారు.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles