Housefly verdict to elect village deputy sarpanch in maharashtra

Fly verdict to elect village deputy sarpanch, Housefly verdict, deputy sarpanch,

Fly verdict to elect village deputy sarpanch, Housefly verdict to elect village deputy sarpanch in Maharashtra

ఈగ వాలితే చాలు పదవి ఇస్తాం?

Posted: 07/04/2014 09:18 AM IST
Housefly verdict to elect village deputy sarpanch in maharashtra

ఇప్పటి వరకు చిలక, ఒంటె, ఆక్ట్ ఫస్ లాంటివి గెలుపు ఓటమి గురించి చెప్పేవి! ఇక నుండి ఆ జాబితాలో.. ఈగ కూడా చేరబోతుంది. అంటే ఇది దర్శకుడు రాజమౌళి ఈగ కాదుండోయ్. ! ఈ ఈగ చాలా సాధరణ ఈగ. ఇప్పుడు ఈగ తీర్పు కోసం ఆ గ్రామం ఆశగా ఎదురుచూస్తుంది. ఉపసర్పంచి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ఈగకు అప్పగించి ఆ గ్రామస్తులు ఓ వింత సాంప్రదాయానికి తెరతీశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేద్ తాలూకా సత్కారష్తల్ గ్రామంలో వారం క్రితం ఈ వింత చోటుచేసుకుంది.

గ్రామపంచాయతీలో మొత్తం తొమ్మిది మంది వార్డుమెంబర్లు ఉన్నారు. వారిలో ముగ్గురు ఉపసర్పంచ్ పదవికోసం పోటీపడ్డారు. ఎన్నికలు గట్రా ఏమీ లేకుండా వారిలో ఒకరికి ఉపసర్పంచ్ పదవి కట్టబెట్టే బాధ్యతను ఈగకు అప్పగించారు పంచాయతీ పెద్దలు. ముగ్గురు పేర్లను చిట్టీలపై రాసి అందరి సమక్షంలో గ్రామంలోని భైరవనాథ్ గుడిలో ఉంచారు. ఈగ ఏ చిట్టీపై వాలితే ఆ చిట్టీలో పేరున్నవారే ఉపసర్పంచ్‌గా ఎన్నికవుతారు.

Housefly-verdict-deputy-sarpanch

వార్డుమెంబర్లంతా వారినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఇందుకు గ్రామస్తులతోపాటు వార్డుమెంబర్లంతా అంగీకరించడంతో ఎంపిక భారం ఈగపైనే వేశారు. ఈ క్రమంలో ఈగ చలువతో సంజీవని అనే మహిళ ఉపసర్పంచ్‌గా ఎన్నికై బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ ఈ విషయం ఆ నోటా, ఈ నోటా జిల్లా అధికారుల చెవినపడడంతో ఇలాంటి విధానాలు అప్రజాస్వామికమని, ఉపసర్పంచ్ ఎన్నిక చెల్లదంటూ అధికారులు అభ్యంతరం తెలిపారు. కానీ గ్రామస్తులు మాత్రం మూకుమ్మడిగా అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చారు.

ఈగ తీర్పు ప్రకారం ఉపసర్పంచ్‌ను వార్డుసభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్తులు కూడా వారి నిర్ణయాన్ని సమర్ధించారు. ఇందులో అధికారులు కలుగజేసుకోవాల్సిన అవసరమేముంది? అని ఉపసర్పంచ్ మామ ఖండేరావ్‌థింగ్లే ప్రశ్నిస్తున్నారు. గతేడాది కూడా ఉపసర్పంచ్ ఎన్నికకు ఇదే పద్ధతిని అనుసరించామని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో కూడా సీఎ పదవికి, మంత్రి పదవులకు ఇలాగే చేస్తే చాలా బాగుంటుందని కొంతమంది రాజకీయ నేతలు అంటున్నారు. అదే మన రాష్ట్రంలో అయితే .. ఈగకు బెల్లం ఆశ చూపించి పదవి దక్కించుకునే నేతలు చాలా మంది ఉన్నరనే విషయం అందరికి తెలిసిందే.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles