Robert vadra has shut down six of his companies

robert vadra has shut down six of his companies, sonia gandhi's son-in-law robert vadra, robert vadra, robert vadra is husband of priyanka gandhi, dlf vadra land deal

robert vadra has shut down six of his companies

కంపెనీలు కొల్లలు కార్యక్రమాలు నిల్లు

Posted: 07/10/2014 09:43 AM IST
Robert vadra has shut down six of his companies

సోనియా గాంధీ కూతురు ప్రియాంకాను పెళ్ళి చేసుకుని అల్లుడైన రాబర్ట్ వాద్రా మీద భూకబ్జాలేమిటి, మరెన్నో వివాదాలు గాంధీకుటుంబాన్ని బజారుకీడ్చాయనే చెప్పుకోవాలి.  ఎంత అవినీతి చేసినట్లుగా అభియోగాలున్నా, పెద్దగా బయటకు రాని ఆ కుటుంబ సభ్యుల అవకతవకలను వాద్రా మాత్రం దాయలేకపోయారు.  దానితో ఆయన మీదనే కాకుండా గాంధీల కుటుంబం మీదనే మచ్చ పడి అది రోజురోజుకీ పెద్దదవుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో వాద్రా తను స్థాపించిన కంపెనీలను ఒక్కొదాన్నీ మూసివేస్తున్నారాయన.  అసలు అన్ని కంపెనీలను ఎందుకు స్థాపించారూ అంటే అందుకు కారణం ఉత్పాదన పెంచటమో, జాతీయాదాయానికి దోహదం చెయ్యటమో, లేక ఉపాధిని పెంచి దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో తోడ్పడటానికి కాదని తెలుసుకోవటానికి పెద్ద ఆర్థిక శాస్త్రంలో ఆరితేరనక్కర్లేదు.  బ్లాక్ మనీని వైట్ లోకి సులువుగా మార్చటానికి బహు చక్కగా ఉపయోగపడేవే కంపెనీలు.  మళ్ళీ ఆ కంపెనీలను నడిపితే మాత్రం తలనొప్పులే.  ఒక కంపెనీని నడపటానికే ముడిసరుకు నుంచి మార్కెటింగ్ వరకు, కార్మికుల నుంచి ఉన్నతోద్యోగుల వరకు యూనియన్లు, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ పన్నులు, అన్నిటిలోనూ తలనొప్పులే.  అలాంటిది ఏకంగా ఆరు కంపెనీలను స్థాపించిన వాద్రాగారు ఏం చేసారూ అంటే ఏమీ చెయ్యలేదట.  స్థాపించటం వరకే నా పని అంటారాయన.  ఏ కార్యక్రమాలూ లేవు కాబట్టి వాటన్నిటిని మూసివేస్తున్నామని ఆయన చెప్పారు.  

బ్లాక్ మనీని క్రమబద్ధీకరించటానికి కాకపోతే అన్ని సంస్థలను ఎందుకు ప్రారంభించినట్లు అని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు.  అయితే ఇది ఆదిలో తెలుస్తున్న విషయాలే.  ఇక దర్యాప్తు అంతంలో ఏమేం బయటపడతాయో వేచిచూడవలసిందే అంటున్నాయి మీడియా వెబ్ సైట్లు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles