Germany win the 2014 fifa world cup

Germany win the 2014 FIFA World Cup, 2014 FIFA World Cup, Germany vs Argentina,

Germany win the 2014 FIFA World Cup, FIFA World Cup Win Makes Germany Uber Happy, 2014 FIFA World Cup final football match,

ఫిఫా వరల్డ్ –కప్- విజేతగా జర్మనీ

Posted: 07/14/2014 09:31 AM IST
Germany win the 2014 fifa world cup

యూరోపియన్ సాకర్ దిగ్గజం జర్మనీ చరిత్ర సృష్టించింది. బ్రెజిల్ రాజధాని రియోడిజనీరోలో రాత్రి జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్లో 1-0తో అర్జెంటీనాను చిత్తు చేసింది. చారిత్రక మారకానా స్టేడియంలో... కిక్కిరిసిన అభిమానుల మధ్య... బలమైన జర్మనీ, ఊపుమీదున్న అర్జెంటీనా నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇరుజట్లు హోరాహోరీగా తలపడటంతో... అదనపు సమయం (30 నిమిషాలు) కేటాయించారు. ఈ సమయం కూడా కరిగిపోతున్న సమయంలో... పెనాల్టీ షూటౌట్ తప్పదేమో అని అందరూ భావించారు.

సరిగ్గా ఏడు నిమిషాల్లో అదనపు సమయం అయిపోతుందనగా అద్భుతం జరిగింది. ఆట 113వ నిమిషంలో పాస్ అందుకున్న గోట్జె తన ముందు ఒంటరిగా ఉన్న అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరోను బోల్తా కొట్టించాడు. అద్భుతమైన గోల్ తో అర్జెంటీనాను ఖంగుతినిపించాడు. ఆ తర్వాత అర్జెంటీనా ఎంత ప్రయత్నించినా గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. అర్జెంటీనా స్టార్ మెస్సీ సర్వశక్తులను ఒడ్డినా తన దేశాన్ని ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. అర్జెంటీనా అభిమానుల్లో నిర్వేదం మొదలైంది. మ్యాచ్ -ఒక్కసారిగా జర్మనీ వైపు మళ్లింది.

fifa-win-germany

ఆ వెంటనే 120వ నిమిషంలో అర్జెంటీనాకు ఫ్రీకిక్- అవకాశం లభించింది. దురదృష్టవశాత్తూ మెస్సీ కిక్- చేసిన బంతి గోల్ పోస్టుపై నుంచి పోయింది. ప్రతీకారం తీర్చుకోవాలన్న అర్జెంటీనా ఆశలు ఆవిరి అయ్యాయి. జర్మనీ 1-0తో విశ్వవిజేతగా నిలిచింది.దీంతో జర్మనీ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు 24 ఏళ్ల తరువాత జర్మనీ తొలి ఫిఫా ట్రోఫీని సొంతం చేసుకుంది. సాకర్ -వరల్డ్ -కప్-లో ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఫైనల్-కు చేరిన జర్మని నాలుగో సారి ప్రపంచ ఛాంపియన్-గా నిలిచింది. బ్రెజిల్ -తరువాత అత్యధిక సార్లు వరల్డ్- కప్ -నెగ్గిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/fifaworldcupwingermany

దీంతో ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇంతవరకు అమెరికా ఖండాల్లో ఏ ఒక్క యూరోపియన్ జట్టు కూడా ప్రపంచకప్ ను గెలవలేదు. ఈ విజయంతో అమెరికా ఖండంపై ప్రపంచ కప్ గెలిచిన తొలి యూరోపియన్ దేశంగా జర్మనీ అవతరించింది.

 Related article

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles