Telangana cm kcr ready praise ceremony to satya nadella

kcr ready praise ceremony to staya nadella kcr, ready, praise ceremony, staya nadella, kcr cruel behavior on andhra peoples, microsoft ceo satya nadella, kcr fire comments on andhra, satya nadella telangana tour satya nadella to meet kcr next month

telangana cm kcr ready praise ceremony to satya nadella, kcr ready praise ceremony to staya nadella kcr, ready, praise ceremony, staya nadella, kcr cruel behavior on andhra peoples, microsoft ceo satya nadella, kcr fire comments on andhra, satya nadella telangana tour, satya nadella to meet kcr next month

ఆంధ్రోనికి కేసిఆర్ సన్నానం చేస్తాడా?

Posted: 07/16/2014 08:18 PM IST
Telangana cm kcr ready praise ceremony to satya nadella

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు నచ్చని పదం, నచ్చని వాడు .. ఒక్కటే.. ఆంద్ర, ఆంధ్రోడు? సీఎం కేసిఆర్ కు ఆంధ్రోడు అంటే అసలు పడదు. ఆంధ్రోళ్లు లేని తెలంగాణ కావాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నిత్యం ఆంధ్రోడని తిట్టందే.. కేసిఆర్ కు నిద్రపట్టదు. ఒకవేళ మరిచిపోయిన ..నిద్రలోనైన ఆంధ్రోడని కలవరిస్తాడు. ఆంధ్రోళ్లు అంటే కేసిఆర్ కు అంత ఇష్టం. అందుకే ఇటీవల.. ఆంధ్ర పిల్లలకు . తెలంగాణ ఇచ్చే ఏ రాయితీ అందకూడదని అధికారులకు క్లాస్ పీకాడు. అంతేకాకుండా.. తెలంగాణలో.. ఒక్క ఆంధ్ర ఉద్యోగి కూడా ఉండటానికి వీలులేదని ఖచ్చితంగా చెబుతున్నాడు. అలాంటి కేసిఆర్.. త్వరలో.. ఒక ఆంధ్రోనికి సన్మానం చేయటానికి సిద్దమవుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కి తెలంగాణ రాష్ట్రం తరుపున సన్మానం చేయటానికి ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంచి మిత్రుడు. ఇద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి తెలంగాణ సీఎం కేసిఆర్ సన్మానం చేయటం అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనేవరో కాదు.. తెలుగు తేజం అయిన సత్య నాదేళ్ళ. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి సంస్థ అయిన మైక్రోసాప్ట్ కు అధినేత సత్య నాదేళ్ళ. కెసిఆర్ గారు సత్య నాదెళ్ళకు సన్మానం చేయనున్నారట. అది కూడా మామూలు సన్మానం కాదు పౌర సన్మానం. అంటే ప్రవాసాంధ్రుడైన సత్యకు తెలంగాణలో గుర్తింపు ఇవ్వడం అనమాట. అంటే ఆయనను కూడా తమ వాడిగానే చేసుకున్నామని అధికారికంగా ఇవ్వడం అనమాట.

telangana-cm-kcr-satya

తాజాగా సచివాలయంలో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి సమావేశమై త్వరలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ హైదరాబాద్ రానున్నారని చెప్పడంతో కెసిఆర్ అండ్ కో రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే సత్య కూడా ఆంధ్రా వ్యక్తేనాన్న విషయం మరిచిపోయాడా? లేక తన అవసరాల కోసం కళ్ళు మూసుకున్నాడా? అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే కెసిఆర్ నిద్ర లేచింది మొదలు ఆంధ్రోడు అంటూ ఆడిపోసుకుంటాడు. అలాంటిది సత్య నాదేళ్ళకు ఎలా సన్మానిస్తాడోనని రాజకీయ నేతలు, తెలంగాణ ప్రజలు, ఆంద్ర ప్రజలు చాలా వింతగా మాట్లాడుకుంటున్నారు.

అలాంటి కెసిఆర్ ఇప్పుడు ఓ ఆంధ్రోడిని ఎలా సన్మానించి పోగడగలరు అంటూ కామెంట్స్ వేస్తున్నారు. అవసరం కోసం కెసిఆర్ ఏదైనా చేస్తారని.. సత్య విషయంలో కూడా తమకు అవసరం ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని.. ఇది కెసిఆర్ కి కొత్తేమీ కాదని.. ఇంట్లో ఆంధ్రా కోడలు, మనవడిని పెట్టుకొని కూడా అవసరం కోసం కెసిఆర్ ఆంధ్రాను ఆడిపోసుకుంటున్న విషయం తెలిసిందే. ‘‘పేకాట.. పేకాటే.. తమ్ముడు తమ్ముడే ’’ అనే సిద్దాంతాన్ని కేసిఆర్ ఫాలో అవుతున్నారని ఆంధ్ర నాయకులు అంటున్నారు. అదే సత్య కూడా మైక్రోసాఫ్ట్ అధినేత కాకుంటే ఆయన్ని కూడా కెసిఆర్ ఆంధ్రోడి గాటికి కట్టేసేవాడని రాజకీయ మేథావులు అంటున్నారు.

telangana-cm-kcr-satya-nadella

 

అయితే కేసిఆర్ 125 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీకి.. రెండు లడ్డులు తినిపించారు. అలాంటిది.. సత్య నాదేళ్ళ కు ఒక లడ్డు తినిపించటంలో పెద్ద గొప్పమేలేదని కేసిఆర్ అభిమానులు అంటున్నారు. కేసిఆర్ రాజకీయ దెబ్బకు.. సోనియా గాంధీ, జైరాం రమేష్, షిండే, చిదంబరం, లాంటి వారే..ఇప్పటికి జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఆంద్రోడు ఒక లెక్క.. అనే ధీమాలో సత్యకు సన్మానం చేస్తున్నట్లు .. రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఏమైన కేసిఆర్ గ్రేట్ !!! అన్నం పెడతావ్, ఆవేశ పడతావ్, ఆంద్రోడని తిడతావ్, అంతలోనే.. ఆంద్రోడికి సన్మానం చేస్తావ్.. నీలాంటి రాజకీయ నాయకుడు ఈ చరిత్రలోనే ఉండాడు. మీ దగ్గర రాజకీయ పాఠాలు .. చాలా మంది రాజకీయ నేతలు నేర్చుకుంటే.. తెలుగు రాష్ట్రాలు త్వరగా బాగుపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘వేలేత్తి చూపేది నువ్వే.. చేతులతో కౌగిలించుకునేది నువ్వే’’ !! నీ రాజకీయ మర్మలు తెలియక చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. ముమ్మటికి కేసిఆర్ కరెక్ట్ అని.. అభిమానులు.. మరో సారి నీ పాలనే రావాలని కోరుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles