Real estate booming in vgtm

real estate booming in vgtm, agrigold’s haailand resorts sale denied, chandrababu naidu oath taking ceremony, murali mohan’s stay at haailand resorts

Real estate booming in VGTM days before announcement of capital for AP

ఆంధ్రాలో రియల్ వ్యాపారం ఆకాశంలో

Posted: 07/21/2014 06:35 PM IST
Real estate booming in vgtm

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడన్నది ప్రకటించాల్సిన సమయం దగ్గర పడుతోంది.  కానీ ఎక్కడ అన్నది ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మాటల్లో గ్రహిస్తున్న పెట్టుబడిదార్లు విజిటిఎమ్ అని ముద్దుగా పిలుచుకుంటున్న విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతంలో 1300 కోట్ల రూపాయల ఆస్తులు చేతులు మారాయి.

కమిటీని రాజధాని నిర్మాణానికి, అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చెయ్యటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో 9 మంది సభ్యుల నియమిస్తూ ఆదివారం జివో పాస్ చేసింది.  ఆ కమిటీలో నలుగురు పారిశ్రామికవేత్తలున్నారు.  

విజయవాడ గుంటూరు మధ్యలో నిర్మించిన హాయ్ ల్యాండి ఫ్యామిలీ రిసార్ట్ యాజమాన్య సంస్థ అగ్రి గోల్డ్ ఇంతవరకు దాని అభివృద్ది కోసం 800 కోట్ల రూపాయల ఋణం కోసం చూస్తున్నవారు కాస్తా 1025 కోట్ల రూపాయల వరకు అమ్ముదామని చూస్తున్నట్లుగా విజయవాడ లోని ఒక బ్యాంక్ అధికారి ద్వారా అందిన సమాచారం.

దీనిమీద స్పందించిన అగ్రిగోల్డ్ లో పనిచేసే అధికారి, దాన్ని అభివృద్ధి చెయ్యటానికి ఋణం కోసం ప్రయత్నించింది నిజమే కానీ అగ్రిగోల్ సంస్థకు ఆ స్థలాన్ని అమ్మే ఆలోచన లేదని, ఈ పుకార్లన్నీ చంద్రబాబు నాయుడు ఎపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆ రిసార్ట్ లో సినిమా నటుడు మురళీ మోహన్ బసచేసినప్పటి నుంచి వస్తున్నాయని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles