Sivaramakrishnan committee suggests on ap capital

e Sivaramakrishnan Committee, Andhra Pradesh Capital, new AP capital, K C Sivaramakrishnan in ap, Sivaramakrishnan Committee Meets Cm, Sivaramakrishnan Committee Meets Cm chandrababu.

sivaramakrishnan committee suggests on ap capital:He thus wanted the Central committee to suggest the most suitable ... capital in ten days after the Sivaramakrishnan Committee submitted its

ఏపీ రాజధానికి 14 ప్రాంతాలు? శివరామకృష్ణన్

Posted: 07/26/2014 06:54 PM IST
Sivaramakrishnan committee suggests on ap capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రధాన పట్టణాల నిర్మాణానికి అనువైన 14 ప్రాంతాలను గుర్తించామని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. మీడియా సమావేశంలో శివరామకృష్ణన్ కమిటీ కొన్ని మార్గదర్శకాలు తెలిపింది. ఏపీలో ఒకే చోట మొత్తం భూములు దొరకడం కష్టమని కమిటీ వెల్లడించింది. అన్ని ప్రాంతాల్లోనూ భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

ఏపీలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోందని, నీరు, రవాణా, ఇతర సౌకర్యాల లభ్యత కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాజధాని ఎంపికపై కీలక సూచనలు, సలహాలు అందజేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించింది.

రాయలసీమలో కరువు ఎక్కువగా ఉందని, దీనికి తోడు నీటి సమస్య కూడా ఉందని శివరామకృష్ణన్ కమిటీ వివరించింది. రాయలసీమలో అన్ని ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉండకపోవచ్చని పేర్కొంది. కృష్ణా-గుంటూరు మధ్య రాజధానిని నిర్మించడం అనువుగా ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ ప్రాంతంలో నీటిసమస్య కొత వరకు ఉందని, భూసేకరణ కూడా కష్టమని వెల్లడించింది. జాతీయ స్థాయి వైద్య సంస్థలు అందరికీ అందుబాటులో ఉన్న చోట పెట్టాలని సూచించింది. దీనిపై ఆగస్టు 20న కేంద్రానికి తుది నివేదిక అందజేస్తామని కమిటీ బాబుకు వివరించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles