Dengue controlling mosquito developed uk based oxytec

Dengue fever control, Dengue mosquito carries Chikungunya and yellow fever, Dengue controlling genetic change, Mosquito genetic change controls Dengue

Dengue controlling mosquito developed UK based Oxytec seeks permission for field test in India

డెంగ్యూని నియంత్రించే దోమ- 513 ఏ

Posted: 07/27/2014 05:17 PM IST
Dengue controlling mosquito developed uk based oxytec

ప్రాణాంతక డెంగ్యూ వ్యాధిని నియంత్రించే దోమ పేరు 513 ఏ.  అది దానికి అర్థం కాని పేరు కాని, అది చేసే పని భ్రూణ హత్య.  డెంగ్యూ ని పెంపొందించే దోమలను పెరిగి పెద్దవకుండా శైశవ దశలోనే వాటిని అంతమొందిస్తుందట.  అంటే ఆ దోమ చంపుతుందని కాదు.  దాని డిఎన్ఏ లో ఉన్న ప్రోగ్రాం ప్రకారం 2 నుంచి 5 రోజులలో వాటి పిల్ల దోమలు చచ్చిపోతాయి.  ఈ పద్ధతిలో జెనెటిక్ గా మార్పులు చేసిన దోమలు స్థానిక దోమలతో మేటింగ్ చేస్తాయి.  అప్పుడు వాటికి కలిగిన సంతానం, వీటిలోని జీన్ వలన శైశవ దశలోనే అంతమొందుతాయి.  అదీ మెకానిజం.  ఏ జాతి క్రిములు ఆ జాతి క్రిములతోనే సంపర్కం చెందుతాయి కాబట్టి వీటి వలన ఇతర జీవులకు అపకారం కలగదని కూడా దీన్ని అభివృద్ధి చేసిన ఆక్సిటెక్ సంస్థ చెప్తోంది.

ఈ మధ్య జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీ సందర్భంగా బ్రెజిల్ ఎదుర్కున్న పెద్ద సమస్య డెంగ్యూని కలిగించే దోమలుండటం.  ఆ సమయంలో ఈ దోమ నం.513 ఏ విజయవంతంగా పనిచేసిందట.  

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనుంచి ఏర్పడ్డ యుకె కి చెందిన పురుగులను నియంత్రించే పరిశోధనలు చేసే ఆక్సిటెక్ సంస్థ ఈ దోమను అభివృద్ధి చేసింది.  దాన్ని భారతదేశంలో పరీక్షించటానికి భారత ప్రభుత్వాన్ని అనుమతి కోరుతోంది.  భారతదేశంలోని డెంగ్యూ ఫివర్ ని కలిగించే దోమలను నియంత్రించటంకోసం ఆ పురుష దోమలకు సంబంధించిన సాంకేతిక వివరాలను భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖకు అందిస్తానంటోంది ఆక్సిటెక్ సంస్థ.

ఇదే విధంగా మలేరియ దోమ విషయంలో కూడా చెయ్యవచ్చునని ఆ సంస్థ చెప్తోంది.  కానీ దాన్ని ఇంకా డెవలప్ చెయ్యవలసి ఉందని చెప్పారు.  డెంగ్యూ ఫివర్ ని కలిగించే దోమలు చికున్ గున్యా, ఎల్లో ఫివర్ వ్యాధులను కూడా కలిగిస్తుందని ఆక్సిటెక్ చెప్తోంది.  

లాబొరేటరీలో దోమలలో ఈ రకమైన జీన్ ని వాటిలోకి పోవటానికి టెట్రాసైక్లన్ ని ఇచ్చారట.  లేబొరేటరీలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని నిజ క్షేత్రంలో ఉపయోగించటానికి సంబంధిత ప్రభుత్వాల అనుమతి కావలసివుంటుంది.  అలా అనుమతులు తీసుకుని ప్రయోగించి చూసిన తర్వాతనే రివ్యూ కమిటీ ఫర్ జెనెటిక్ మానిప్యులేషన్ స్వీకరిస్తుంది, జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రూవింగ్ కమిటీ అనుమతి లభిస్తుంది.  

మనకు అనుగుణంగా పశుపక్ష్యాదులను మార్చుకోవటం ఎప్పటి నుంచే మానవాళి అనుసరిస్తున్న విధానమే.  పాములకు కోరలు తీసివెయ్యటం, వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులలో శృంగారేచ్ఛకాని సంతానోత్పత్తి కాని లేకుండా వాటి వృషణాలను ఛిద్రం చెయ్యటం, పెంపుడు పక్షులు ఎక్కవ ఎగరకుండా వాటి రెక్కలను కత్తిరించటం, గుర్రానికి నాడా దించటం, ఇలాంటివి చేస్తూనే వస్తున్నాం.  కానీ ఈ దోమలలో చేసేది వాటి డిఎన్ఏ ప్రోగ్రాంనే మార్చే మరీ సూక్ష్మమైన విధానం.  

వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్లుగా డెంగ్యూ దోమను డెంగ్యూ దోమతోనే అంతమొందించాలన్నది శాస్త్రవేత్తల ప్రయోగం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles