Ap capital vijayawada costly for middle income group

Vijayawada not suitable AP capital, Vijayawada real estate high, Vijayawada capital distant from Rayalaseema, Vijayawada capital problematic for middle income group

AP Capital Vijayawada costly for middle income group: As real estate rates rose sky high in that area

విజయవాడ రాజధానైతే మరో ఇబ్బంది?

Posted: 07/29/2014 10:31 AM IST
Ap capital vijayawada costly for middle income group

విజయవాడలో ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  మురికివాడలూ ముమ్మరంగానూ ఉన్నాయి, అవీ కిక్కిరిసిపోయి ఉన్నాయి.  ఇలాంటి నేపథ్యంలో విజయవాడ ప్రాంతంలో రాజధాని వెలిస్తే మధ్య తరగతి కుటుంబాలు బ్రతకటం కష్టమని కొందరు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు.  

రాజధాని విషయంలో నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలివెయ్యటంతో ఊహించిన విధంగానే చంద్రబాబు నాయుడు దగ్గరకు వివిధ ప్రాంతాల నుండి ప్రతినిధులు వచ్చి రాజధాని ఏర్పాటు గురించి వారి వారి వాదనలు వినిపిస్తున్నారు.  జస్టిస్ లక్ష్మణరెడ్డి, మాజీ ఛీఫ్ సెక్రటరీ కె.జయభారత రెడ్డి విజయవాడను రాజధానిగా చేస్తే రాయలసీమకు చాలా దూరమవుతాయని అన్నారు.  

ఈ సమస్యలుంటాయి కాబట్టే ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ని ప్రకటించటం జరిగింది.  కానీ తొందరపాటుతో రాజధాని విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఉంటుందన్న సంకేతాలు ఇవ్వటంతో అక్కడ ధరలు మరీ ఎక్కువగా పెరిగిపోవటంతో మధ్య తరగతి కుటుంబాలే కాదు ప్రభుత్వం కూడా భూమిని కొనలేని స్థితికి వచ్చింది.  ఈ సమస్య మరో ప్రాంతంలో నైనా అలాగే జరుగుతుంది.    

దానికి మందు రేట్లను సీల్ చెయ్యటమే.  ఈసారి ఏ ప్రాంతంలో రాజధానిని నిర్మించదలచకున్నారో ఆ ప్రాంతంలో ముందుగానే రేట్లను సీల్ చేసినట్లయితే గవర్నమెంట్ రేటు పెరగదు, దానితో క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గిపోతాయి.  ఒకసారి రియల్ ఎస్టేట్ రేట్ పెరిగిందంటే తగ్గటం కష్టమౌతుంది.  లాభార్జన కోసం పెట్టుబడిపెట్టిన వాళ్ళలో ఎవరూ తక్కువకు అమ్మటానికి సిద్ధపడరు.  

రేప్పొద్దున్న విశాఖపట్నం రాజధాని అని అనుకున్నా ఇదే పరిస్థితి వస్తుంది.  కాబట్టి ఇప్పటికే రాజధాని ఎక్కడ అన్నదాన్ని నిర్ణయించటంలోనే చాలా జాప్యమైంది కాబట్టి ఇప్పటికైన సరైన నిర్ణయాన్ని సత్వరం తీసుకుని రాజధానిని సింగపూర్ లా కాకపోయినా కనీసం ప్రభుత్వాన్ని నడపటానికి అవసరమైన విధంగా తీర్చిదిద్దుకుంటే ముందు ప్రభుత్వానికి తలదాచుకునే వీలు కలుగుతుందని కొందరు నాయకులంటున్నారు.  రాయలసీమకు దూరం అంటే హైద్రాబాద్ కంటే కాదు కదా అంటున్నారు మరికొందరు.  

ఈ వత్తిడులు మధ్య చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles