Pawan kalyan ap brand ambassador like amitabh for gujarat

pawan kalyan ap brand ambassador, gujarat brand ambassador amitabh bachchan, pawan kalyan election campaign for tdp, pawan kalyan brand ambassador qualities

Pawan Kalyan AP Brand Ambassador like Amitabh for Gujarat: Pawan Kalyan vows to work for people of state as qualifying brand ambassador

ఆంధ్రా బ్రాండ్ అంబాసడర్ గా పవన్ కళ్యాణ్?

Posted: 07/30/2014 11:05 AM IST
Pawan kalyan ap brand ambassador like amitabh for gujarat

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ని నియమించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వినిపిస్తున్నాయి.  గుజరాత్ రాష్ట్రానికి అమితాభ్ బచ్చన్ బ్రాండ్ అంబాసడర్ గా పనిచేస్తూ వస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ ని బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లుగా సమాచారం.  

ఏం చెయ్యాలీ బ్రాండ్ అంబాసడర్లు?

గుజరాత్ లో అమితాభ్ బచ్చన్ తన నిర్దుష్టమైన పాత్రను చక్కగా పోషించారు.  రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి, పర్యాటక స్థానాల గురించి చెప్తూ రాష్ట్రంలోను దేశంలోనూ వీలైతే ప్రపంచంలోనూ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయాలి.  అందుకు టివి ప్రకటనలు, మిగతా మాధ్యమాల ద్వారా ఆ పని చెయ్యవలసివుంటుంది.  

పవన్ కళ్యాణ్ సేవలు తెదేపాకు పనికివస్తాయా?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాన్ని అభివృద్ధి చెయ్యాలని చూస్తున్న తరుణంలో తెలుగు దెశం పార్టీకి ఆయన పనిచేస్తారా అన్నది ప్రశ్న.  ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి ప్రచారాన్ని నిర్వహించటం జరిగిందన్నది వాస్తవమే కానీ అది తెలుగు దేశం పార్టీకోసం కాదు భారతీయ జనతా పార్టీ కోసం కాదు.  కేవలం రాష్ట్రం, దేశాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే.  అప్పటి పరిస్థితుల్లో భాజపా తెదేపాలను దేశంలోను, రాష్ట్రంలోను నిజాయితీ గా పనిచెయ్యగల పార్టీలుగా గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీల తరఫున ప్రచారం చెయ్యటమే కాకుండా వోట్లు చీలకుండా ఉండటం కోసం జనసేన పార్టీని ఎన్నికలలోకి దింపటంలేదని కూడా ప్రకటించారు.

అందువలన పవన్ కళ్యాణ్ కి తెదేపా మీద ప్రేమ ఉందా అంటే, దాని కంటే ముందు రాష్ట్రం మీద ఉంది కాబట్టి ఆయన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా హృదయపూర్వకంగా పనిచేస్తారనటంలో అనుమానం లేదు.  రాష్ట్రం కోసం వేరే పార్టీ కే ప్రచారం చేసినప్పుడు, ఆ రాష్ట్రం కోసం ప్రచారం చెయ్యరా?  

పవన్ కళ్యాణ్ సినిమాలను కెసిఆరే చూడలేదని చెప్పారు.  ఇక దేశంలో అందరూ చూడకపోయినా, ఆ మధ్య కాలంలో జాతీయ స్థాయిలోని కొన్ని పత్రికలు చేసిన సర్వేలో దేశంలో టాప్ హీరోలలో 4, 5 స్థానాలను ఆక్రమించినట్లుగా తేలింది.  దానితో పాటు రాష్ట్ర విభజన, దానితో పాటే ఎన్నికల సందర్భంలో దేశమంతా ఇరు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తితో చూడటం, ఆ ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించటం, కానీ తానుగా ఎన్నికల బరిలోకి దిగకుండా దేశంలో భాజపాకి రాష్ట్రంలో తెదేపాకి మద్దతుగా ప్రచారం చెయ్యటం కూడా దేశమంతా గమనించింది.  

అందువలన అమితాభ్ బచ్చన్ లా పవన్ కళ్యాణ్ ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించినట్లయితే ఆయన పూర్తి న్యాయం చేస్తారని ఆశించవచ్చు.  ఎందుకంటే పార్టీలకు అతీతంగా, వ్యక్తులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలకోసం పనిచెయ్యాలనుకున్న నాయకుడిగా కనిపిస్తున్నారు కాబట్టి.  

బ్రాండ్ అంబాసడర్ తో ఏం లాభం కలుగుతుంది?

రాష్ట్రానికి పేరు తేవటం వలన ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు వచ్చి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది.  రెండవది, పర్యాటక రంగాభివృద్ధి జరిగి రాష్ట్ర ఆదాయం ఆ రూపంలో కూడా పెరగవచ్చు.  రాష్ట్రంలో ఒక పక్క సినీ హీరో నంబర్ ఒన్ గా వచ్చిన పేరు, రాజకీయ పార్టీని ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగా లాంచ్ చేసిన తీరు, రాజకీయ నాయకులను ప్రశ్నించటానికే వచ్చానని చెప్పటం, అలాగే ఎవరూ తలపడని విధంగా కెసిఆర్ కి దీటుగా సమాధానం చెప్పటం, ఇలాంటివన్నీ ఎలాగూ పవన్ కళ్యాణ్ ని ఇప్పటికే ఎత్తైన స్థానంలో నిలబెట్టాయి కాబట్టి, ఆయన చెయ్యదలచుకుంటే రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్ గా రాష్ట్రాన్ని కూడా అలాగే ఎత్తులో నిలబెట్టగలుగుతారని ఆశించవచ్చు.

బ్రాండ్ అంబాసడర్ యోగ్యతలేమిటి?

దేశ విదేశాలలో పేరు ఉండటం ఒక్కటే కాదు, బ్రాండ్ అంబాసడర్ కి అవసరమైన యోగ్యత ఆత్మ సమర్పణ, అంకిత భావం, దేశం రాష్ట్రాల పట్ల గౌరవ భావం, పట్టుదల దీక్షలతో పనిచెయ్యగలగటం, నమ్మిన సిద్ధాంతం కోసం వ్యక్తిగతమైన పేరు ప్రఖ్యాతలతో పాటు ఇతర లాభాలను కూడా విడనాడి కేవలం రాష్ట్ర ప్రజలకోసమే పాటుపడే నైజం.  మిగతా రాష్ట్రాల బ్రాండ్ అంబాసడర్ల గురించి మాట్లాడి వాళ్ళతో పోల్చటం అనవసరం కానీ, పైవన్నీ పవన్ కళ్యాణ్ లో పుష్కలంగా కనిపిస్తున్నాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles