Tamil nadu cm jayalalithaa and modi love letters in sri lanka

jalalithaa and modi love, jalalithaa and modi love letters, tamil nadu cm jayalalitha, Article in SL defence website, Tamil Nadu, Sri Lanka, Jayalalithaa, Narendra Modi, Love letter, Sri Lankan defense ministry website

tamil nadu cm jayalalithaa and modi love letters in sri lanka: The entire political spectrum of Tamil Nadu spoke in one voice on Friday, hitting out at the Sri Lankan government for the insensitive portrayal of Chief Minister J Jayalalithaa and Prime Minister Narendra Modi on the Lankan Defence Ministry website

బయటపడిన మోడీ ప్రేమలేఖలు?

Posted: 08/02/2014 12:59 PM IST
Tamil nadu cm jayalalithaa and modi love letters in sri lanka

తమిళనాడులో బయటపడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రేమలేఖలు. అంటే.. మోడీ గారు ప్రేమలేఖలు రాసే అలవాటు ఉందో లేదో తెలియదు గానీ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు ప్రేమలేఖలు రాసే అలవాటు ఉందని తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడు జాలర్లపై శ్రీలంక దాడులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలను ప్రేమలేఖలని విమర్శిస్తూ శ్రీలంక రక్షణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో వచ్చిన వ్యాసంపై దేశంలో పెను దుమారం రేగింది.

‘మోడీకి జయలలిత ప్రేమలేఖలు ఎంతవరకు సమంజసం?’ అనే అనుచిత శీర్షిక, జయ, మోడీల ఫొటో ఉన్న ఈ వ్యాసంపై జయతోపాటు బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే తదితర తమిళ పార్టీలు మండిపడ్డాయి. తమిళ పార్టీలు, సంస్థలు జయకు అండగా ఏకతాటిపైకొచ్చి తమిళనాడులో ధర్నాలు నిర్వహించి, లంక అధ్యక్షుడు మహీంద రాజపక్స దిష్టిబొమ్మలను తగలబెట్టాయి.

జయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాశారు. తన పరువు తీసేలా ఉన్న దీన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. ‘భారత సమాఖ్య నిర్మాణంలో చీలికలు తెచ్చేందుకు లంక ప్రయత్నిస్తోంది. లంక హైకమిషనర్‌ను పిలిపించి మాట్లాడాలని విదేశాంగ శాఖను ఆదేశించించండి. ఆ దేశంతో క్షమాపణ చెప్పించండి’ అని డిమాండ్ చేశారు.

భారత ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొలంబోలోని భారత హైకమిషన్ ఈ ఉదంతాన్ని లంక ప్రభుత్వం ముందు లేవనెత్తింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం జయ, మోడీలకు బేషరతుగా క్షమాపణ చెప్పి, ఆ వ్యాసాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles