Telangana state power crisis kcr order to buy power for telangana

telangana state, telangana state power, telangana farmers, power problems, Electricity crisis increasing, Electricity crisis in telangana, bifurcation, telangana government,

telangana state power crisis kcr order to buy power for telangana: After bifurcation, The state of Andhra Pradesh got surplus electricity needs huge projects and industries and the Telangana state possesses major industries and projects needs electricity .

రైతులు 3ఏళ్లు ఆగితే.. 24గంటల స్వర్గం చూపిస్తా? కేసిఆర్

Posted: 08/06/2014 06:46 PM IST
Telangana state power crisis kcr order to buy power for telangana

ఆనందం వచ్చినప్పుడు ఒక మాట...! ఆవేశం వచ్చినప్పుడు మరో మాట...! ఆలోచన వచ్చినప్పుడు మడమ తిప్పటం అలవాటుగా మార్చుకున్న తెలంగాణ ఉద్యమం పులి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ‘‘ఉసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చి ఉండదని ’’ తెలంగాణ మేథావులు అంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు అత్తర్ పూచి, ఆవకాయ నాకించి, హామీలు కురిపించి, అధికారం వచ్చిన తరువాత, హామీలు అమలు చేయలంటే.. పెద్ద తతంగం ఉంది, అదీ మీకు తెలియదని తెలంగాణ ప్రజల నోటి తాళం వేయటం జరిగింది.

ఇప్పుడు ఒక పక్క వరాలు కురిపిస్తూ, మరో పక్క ఇచ్చిన హామీలను మరిచిపోండని ఉచిత సలహా ఇస్తున్నారు. పరిస్థితి వచ్చే మూడేళ్ళ వరకు ఇదే విధంగా ఉంటుందన్నారు. మూడేళ్ళ తర్వాత 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. అప్పటి వరకు రైతులు ఓపిక పట్టక తప్పదని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును జయశంకర్ వర్శిటీగా తెలంగాణ ప్రభుత్వం మార్చడంపై ఏపీ నేతలు మండిపడుతుండటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మేం పేరు మారిస్తే మీకెందుకు ఏడుపు? మీ బతుకు మీది... మా బతుకు మాది" అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో జయశంకర్ కంటే గొప్ప నేత లేరని... వర్శిటీకి ఆయన పేరు పెట్టడం మంచి నిర్ణయమే అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయంలో సార్ లేకపోవడం తీరని లోటుగా ఉందని ఆవేదని వ్యక్తం చేశారు.

cm-kcr-electricity-crisis

ఇప్పుడు కేసిఆర్ మాటలను బట్టి చూస్తే తెలంగాణ రైతులు మూడేళ్లు కరెంట్ నరకం అనుభవించాల్సిందే. తెలంగాణ రైతులకు మూడేళ్ల వరకు విముక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పటం జరిగింది. అయితే కేసిఆర్ లోని ఆవేశమే.. తెలంగాణ ప్రజలకు కొత్త కష్టాలను కొన్ని తెస్తున్నాయి. నిన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మిగిలు కరెంట్ కావాల్సినంత ఉంది. కానీ కేసిఆర్, గులాబీ గ్యాంగ్ నోటి దురుసు వల్లే తెలంగాణ రైతులకు కరెంట్ కష్టాలు వచ్చాయి. ‘‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లు ’’ అంటే ఇదే అధికారం వచ్చింది. అందరు ఆనందంగా ఉన్నారు. కానీ నిత్యం ఆంద్రులో పై విమర్శలు చేయటం, లేదంటే.. కోర్టుకు వెళ్లటం, శృతిమించి సవాల్ చేయటమే తెలంగాణ కు కరెంట్ శాపమైంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో మంచిగా ఉండి, అన్నదమ్ముళ్ల ఇచ్చిపుచ్చుకుంటే.. తెలుగు ప్రజలు అనందంగా ఉండేవారు. కానీ రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముళ్ల కలిసి ఉంటాం!! ఆంద్రప్రజలను మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం!! అని చెప్పిన నేతలే.. ఆంధ్ర పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కేసిఆర్ పుణ్యమా అని ఆంద్రతో గొడవలే ..గొడవలు. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసి, మీడియాలో ఆంధ్రోళ్లుపై నిప్పులు కురిపించటం జరిగింది.

‘‘తెలంగాణకు ఆంధ్ర ఎంత దూరమో...!! ఆంద్ర కు తెలంగాణ అంతే దూరమనే విషయం మరిచి కేసిఆర్ కయ్యానికి కలుదువ్వుతూ.. తెలంగాణ ప్రజలు జీవితాలతో చీకటి ఆటలు ఆడుతున్నారు. తెలంగాణ సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీలు పూర్తి కావలంటే..కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు ఎన్నికష్టాలు అయినా పడతాం..కానీ ఆంధ్రతో ఎలాంటి సంబంధం పెట్టుకోమని కేసిఆర్ వ్యవహరించే ధోరణితో.. సమస్యను జఠిలం చేస్తున్నారు. ‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తేవటం అంటే ఇదే’’. ఆంధ్రతో మంచి సంబందాలు పెట్టుకుంటే.. కేసిఆర్ కు వచ్చే నష్టం ఏమిటో తెలియదు గానీ, తెలంగాణ రైతులు, ప్రజలు కరెంట్ కష్టాలను నుండి బయటపడతారనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state  Electricity crisis in telangana  bifurcation  telangana cm kcr  

Other Articles