Militant takeover of iraqs largest christian city

Iraq crisist, Islamic State militants, northern Iraq, Yazidi religion

Militant takeover of Iraqs largest Christian city: Iraqis people from the Yazidi community arriving in Irbil in northern Iraq after Islamic militants attacked the towns of Sinjar and Zunmar. ... Muslims as apostates, and has demanded Christians

ఆల్టిమేటం..జారీ ! మీరు మా చేతిలోనే చావాలి?

Posted: 08/09/2014 01:35 PM IST
Militant takeover of iraqs largest christian city

ఆల్టిమేటం జారీ చేసి మరి ప్రజలు నిలువున చంపుతున్నారు. ఇంత ఘోరమైన సంఘటనన ఇరాక్ లో జరుగుతుంది. ఒకరు కాదు .. ఇద్దరు కాదు.. వందల మంది.. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి కాపాడటానికి ఏ దేవుడు ముందుకు రావటంలేదు!! దీంతో ఇరాక్ ప్రజలు ఆకలితో పోరాడుతూ.. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు వీడుస్తున్నారు. ఇరాక్‌లోని అధికార షియా ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించటమే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు, దేశ ఉత్తర ప్రాంతంలోని క్రిస్టియన్ మైనారిటీలు అధికంగా ఉండే కారకోష్, సంప్రదాయ యెజిదీలు నివసించే షింజర్ ప్రావిన్స్‌లను తాజాగా ఆక్రమించారు. వందలమందిని చంపివేశారు.

క్రిస్టియన్లకు చెందిన దాదాపు 1500 పవిత్ర కట్టడాలు, చర్చిలను ధ్వంసం చేశారు. దీంతో వేలమంది క్రిస్టియన్లు, యెజిదీలు ప్రాణాలు కాపాడుకొనేందుకు కట్టుబట్టలతో ఇండ్లు విడిచి పారిపోయారు. యెజిదీ జాతీయులంతా ఉగ్రవాదులకు దొరకకుండా షింజర్‌లోని అతిపెద్ద పర్వతంపైకి ఎక్కారు. పర్వతాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు కిందికి దిగిన వారిని దిగినట్లు తలలు నరికి చంపుతున్నారు.

పర్వతంపైనే ఉండి ఆకలితో చావండి.. లేదా కిందికి వచ్చి మా చేతుల్లో చావండి అని ఆల్టిమేటం జారీ చేశారు. దీంతో రాళ్లు రప్పలు తప్ప ఒక్క గడ్డిపరకకూడా లేని ఆ పర్వతంపై రెండుమూడు రోజులుగా దిక్కులేని జీవనం గడుపుతున్న యెజిదీలు ఆహారం, నీరు లేక మరణిస్తున్నారు. ఇరాక్ విమానాలు అడపాదడపా ఆహారం చేరవేస్తున్నప్పటికీ వేల మంది యెజిదీలకు అవి ఏమాత్రం సరిపోవటంలేదు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iraq crisist  Yazidi religion  Militant takeover of Iraq'  

Other Articles