4 year satya climbs tirumala temple hill in 40 minutes

tirumala, tirupati, tirumala hills, 4 year old boy, satya,

4 year satya climbs tirumala temple hill in 40 minutes: Tirumala by road and climbing the hills by walking. ... It is 40 minutes drive from the entrance of the Ghat to the Tirumala temple town

తిరుమల కొండపై రికార్డు సాధించిన చిన్నోడో!

Posted: 08/13/2014 06:28 PM IST
4 year satya climbs tirumala temple hill in 40 minutes

ఇటీవల కాలంలో తిరుమల కొండపై అద్బుతాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఒక మూగ అబ్బాయి కి.. ఏడుకొండల వెంకన్న సన్నిధిలో .. అమ్మ అని పిలిచిన విషయం తెలిసిందే. పుట్టు మూగ అయిన అబ్బాయికి .. వెంకన్న సన్నిదిలో మాటలు రావటం నిజంగా ఒక మిరాకిల్ !!

ఈ రోజు తిరుమల కొండ పై మరో అద్బుతం సృష్టించాడు.. ఒక చిన్మోడో. నాలుగేళ్ల బాలుడు కేవలం 40 నిమిషాల్లోనే మొత్తం నడకదారి మార్గాన్ని అధిగమించి కొండపైకి చేరుకున్నాడు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా వెంకన్న మహిమే అని అందరు అంటున్నారు.

తొలిసారి తన తండ్రి సాయిబాబుతో వచ్చినప్పుడు ఎత్తుకుంటామన్నా వినకుండా దిగి మెట్లు ఎక్కడంతో తల్ల్లిదండ్రులు ఇది దైవకృపగా భావించి అప్పటినుంచి ప్రతి నెలా తీసుకురావడం మొదలుపెట్టారు. తొలిసారి రెండు గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కిన సత్య, అప్పటినుంచి వరుసగా సమయం తగ్గించుకుంటూ వచ్చి, ఈసారి కేవలం 40 నిమిషాల 20 సెకన్లలోనే మెట్లమార్గం ఎక్కేశాడు.

కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన ఎస్. తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు తన పుట్టిన రోజైన ఆగస్టు 13వ తేదీ ఈరోజు రికార్డు స సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. స్వామి మహిమలు చాలా అద్బుతంగా ఉంటాయి. అందుకే ఆ గోవిందుడి నామమం ఎంతో రుచి ఎంతో రుచి..!! మహిమలు కలిగిన మా వెంకన్న అందుకో.. మా హారతులు!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala hills  Tirumala Tirupati Devasthanams  Ttd Information  TTD darshan  

Other Articles