Telangana cm kcr met with kodela sivaprasad and called him brother in meeting

kcr latest news kodela siva prasad latest news, kcr with kodela siva prasad, kodela siva prasad kcr, political news, telugu news, andhra political news, telangana political news, political leaders

telangana cm kcr met with kodela sivaprasad and called him brother in meeting : After a long time kcr met with his opposition party senior leader kodela siva prasad which go viral in political way

టీడీపీ పార్టీలో కేసీఆర్ అన్నయ్య?

Posted: 08/18/2014 04:05 PM IST
Telangana cm kcr met with kodela sivaprasad and called him brother in meeting

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు టీడీపీ పార్టీలో ఒక అన్నయ్య వున్నాడు. నమ్మశక్యం కాలేదు కదా.. కానీ ఈ మాట మాత్రం నిజమే! ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ గారే వ్యక్తపరిచారు. కానీ ఆయన సొంత అన్నయ్య మాత్రం కాదులెండి... అతని మీదున్న అభిమానంతో కేసీఆర్ అలా వ్యవహరిస్తారని క్లారిటీ ఇచ్చుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. టీడీపీ సీనియర్ నేత - ప్రస్తుత ఏపీ అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాద్!

టీఆర్ఎస్ పార్టీని స్థాపించకముందు కేసీఆర్ టీడీపీలో కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే! దీర్ఘకాలం టీడీపీలో వున్న కేసీఆర్.. అప్పటి పలువురు నాయకులతో ఈయనకు సన్నిహిత సంబంధం చాలా బాగానే వుండేది. ఈ నేపథ్యంలోనే ఆయనకు కోడెల శివప్రసాద్ తో బంధం బాగా కుదిరింది. దాంతో ఆయన కోడెలను అన్నా అంటూ పిలిచేవారు. కేవలం ఈయననే కాదు.. అప్పట్లో వున్న సీనియర్ నాయకులందరినీ కేసీఆర్ ఎంతో గౌరవంగా ఆరిస్తూ వారితో అప్యాయతగా వుండేవారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ఒప్పుకోవడంతోపాటు టీడీపీ పార్టీలో వున్న కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్పడం విశేషం! అయితే ఆయన అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఆ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు అదే ఆప్యాయతతో వ్యవహరించడాన్ని చూస్తుంటే.. ఆయన తన పాత విషయాల్ని మర్చిపోలేదని ఆయన మాటల ద్వారానే వ్యక్తమవుతోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఆయన టీడీపీ పార్టీవర్గాలవారితో భేటీ అవడమే!

చాలారోజుల తర్వాత కేసీఆర్ టీడీపీ వర్గాలతో భేటీ అయిన అనంతరం.. అందులో ముఖ్యంగా కోడెల శివప్రసాద్ తో మాట్లాడిన పలుమార్లు కేసీఆర్ ఆయన్ను అప్యాయతగా అన్నా అంటూ సంబోధించారు. ఆయనతో వున్న బంధాన్ని గతంలోలాగే కలిసి ప్రేమగా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేసేసింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో వుండి కూడా కేసీఆర్ తన అహంభావాన్ని ప్రదర్శించకుండా పాత విషయాల్ని గుర్తుపెట్టుకుని... తన సీనియర్ నాయకులను అన్నా అని సంబోధించడం సమావేశంలో పాల్గొన్నవారిని ఆయన వ్యక్తిగత విషయం అందరినీ ఆకట్టుకుంది. ఏదేమైనా కేసీఆర్ మనస్తత్వం చాలా మంచిదనే చెప్పుకోవాలంటూ రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  kodela siva prasad rao  trs party leaders  tdp party leaders  

Other Articles