Sugar price may increase because of government raises import duty

sugar, sugar cane, sugar crushers, sugar production, sugar disease, central government, narendra modi, latest news, import, export, online shoping, latest news

central government raised import duty on sugar by 25percent causes price may increase : sugar price may increase as the government raised import duty to 25 percent

చక్కెరపై దిగుమతి సుంకం పెంపు

Posted: 08/22/2014 05:28 PM IST
Sugar price may increase because of government raises import duty

షుగర్ (చక్కెర) ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ ఒకటి. మనదేశంలో చక్కెరను ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే మన దేశంలో షుగర్ పేషంట్లు, లావు అవుతున్న వారి సంఖ్య కూడా అంత ఎక్కువగా పెరుగుతోంది. మనం వాడే షుగర్ లో ఎక్కవు శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుండి చక్కెర దిగుమతిపై పన్ను పెంచింది. దిగుమతి సుంకంను 15శాతం నుంచి 25శాతానికి పెంచింది. దీంతో త్వరలోనే చక్కెర చేదెక్కనుంది. పండగల వేళ పాయిసం చేసుకోకుండా ప్రభుత్వం ఇలా చేసిందేంటి అనుకుంటున్నారా.., ఇదంతా ప్రజా ప్రయోజనం కోసమే అని కేంద్రం చెప్తోంది. మన దేశీయ చక్కెర పరిశ్రమలను కాపాడేందుకే దిగుమతి సుంకం పెంచామంటోంది.

    కాస్త తక్కవకు వస్తుందంటే ఆకాశానికెళ్ళి షాపింగ్ చేసి వచ్చే మనం.., చీప్ గా వస్తుందిగా అని విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఉత్పత్తయ్యే చక్కెర కంటే విదేశాల్లో ఉత్పత్తయ్యే చక్కెరనే ఎక్కువగా వాడుతున్నాం. దీంతో దేశీయ షుగర్ కంపనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఈ పరిశ్రమలను నష్టాలనుంచి గట్టెక్కించేందుకు నడుం బిగించిన కేంద్రం.., దిగుమతి సుంకం పెంచటం ద్వారా విదేశీ చక్కెర వినియోగం తగ్గించాలని భావిస్తోంది. దిగుమతి సుంకం పెంచితే చక్కెర దిగుమతి తగ్గించి దేశీయ కంపనీల వద్ద ఉత్పత్తికి డిమాండ్ వస్తుందని కేంద్రం ఆలోచన. దిగుమతి సుంకం 40శాతం వరకు పెంచుతామని ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వన్ చెప్పినా.., చివరకు దీన్ని 25శాతానికి తగ్గించారు. వివిధ ప్రాంతాలను బట్టి ప్రస్తుతం రూ.34 నుంచి 40 మద్య ఉన్న కేజీ చక్కెర ధర తాజా పెంపుతో రూ.40 నుంచి 50 మద్యకు పెరుగుతుందని వినియోగదారుల ఫోరం అంచనా వేస్తోంది. తాజా పెంపు నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించకుండా దాడులు చేయాలని అధికారులు నిర్ణయించారు.


ఇదంతా దేశీయ కంపనీల కోసం

    విదేశాల నుంచి చక్కెర దిగుమతి చేసుకుంటుండటంతో.., దేశంలోని చక్కెర పరిశ్రమలు తీవ్ర నష్టాలను ఎదుర్కుంటున్నాయి. తమకు ఉత్పత్తి ఖర్చు కంటే మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటతో అప్పులపాలవుతున్నామని కంపనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో కేజి చక్కెర ఉత్పత్తికి 37 రూపాయలు అవుతుండగా ఆ రాష్ర్ట మార్కెట్లో కేజి రూ.30-32 మధ్యే ఉంటోంది. దీంతో వారు కేజిపై ఆరు రూపాయలు నష్టపోతున్నారు. అదే విధంగా మహారాష్ర్టలో కేజి చక్కెర ధర 28రూ.లు ఉండగా ఉత్పత్తికి మాత్రం 31 రూపాయలు అవుతోంది. విదేశీ చక్కెర దెబ్బతో తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని భారత చక్కెర పరిశ్రమల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తమను ఆదుకునేందుకు తక్షణం ప్రభుత్వం రంగంలోకి దిగకుంటే.., కంపనీల మూసివేత మాత్రమే మార్గంగా కన్పిస్తోందని హెచ్చరించింది.

    కంపనీల బాధను అర్దం చేసుకున్న కేంద్రప్రభుత్వం దిగుమతి సుంకంను 25శాతానికి పెంచింది. తక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకునే వారితో పాటు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకునేవారిపై కూడా ఈ సుంకం విధిస్తున్నట్లు కస్టమ్స్ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయాన్ని చక్కెర పరిశ్రమల సంఘం స్వాగతించింది. ప్రస్తుత డాలర్ - రూపాయి మారకం విలువ ఆధారంగా దిగుమతి జరుగుతుండటతో పెంచిన దిగుమతి సుంకం ప్రభావం ఖచ్చితంగా దిగుమతులపై ఉంటుందని సంఘం వెల్లడించింది. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయం దేశీయ పరిశ్రమలు బాగుపడేందుకు సహాయం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. దేశీయ చక్కెర పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించిన కేంద్రం పరిశ్రమలకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకుంది. చక్కెరపై దిగుమతి సుంకం పెంచటంతో పాటు ఎగుమతిలో సబ్సిడీ అందిస్తోంది. ఫలితంగా కంపనీలు లాభాలను ఆర్జిస్తాయని భావిస్తోంది.

తీయని వేడుక ఎలా?

దిగుమతి సుంకం పెరగటంతో దేశంలో చక్కెర ధరలు కూడా పెరగటం ఖాయం. కేజీకి కనీసంగా ఐదు నుంచి గరిష్టంగా పది రూపాయల వరకు చక్కెర ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఇదే జరిగితే చక్కెర వినియోగదారుడికి తీపిక కాకుండా చేదుగానే రుచిస్తుంది. ఉదయం టీ తాగటం దగ్గరి నుంచి మనకు షుగర్ తో విడదీయరాని బంధం ఉంది. అలాంటి చక్కెర ధర పెరగటంతో వినయోగం తగ్గనుంది. ఇంట్లో చేసుకునే పాయసం, కేసరిలతో పాటు మార్కెట్లలో దొరికే సలాడ్స్, డ్రింక్స్ పై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అంటే అవికూడా పెరగవచ్చన్నమాట. ఇక స్వీట్ల ధర పెరగటం ఖాయం. ప్రతి స్వీటులోను చక్కెరనే వినియోగిస్తారు. చక్కెర లేకుండా చేసే స్వీట్లు అతి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సందర్బానుసారంగా తీయని వేడుక చేసుకుందామనుకున్నా.., ఆలోచించాలిపుడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sugar  import  central government  latest news  

Other Articles