Cash on delivery gif

indian railway, rail timings, indian rail info, train timings, train routes, railway jobs, irctc, train ticket booking, online ticket booking, online shoping, home delivery, cash on delivery, debit cards, e commerce, latest news

indian railway introduces new facility that is cash on delivery of tickets : with collabration of a private agency railway department introducing cash on delivery, home delivey facility to passengers

ట్రైన్ టికెట్.. క్యాష్ ఆన్ డెలివరి !!

Posted: 08/22/2014 06:26 PM IST
Cash on delivery gif

ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనేక పాట్లు పడుతున్న రైల్వే శాఖ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఇన్నాళ్ళు ఆన్ లైన్ షాపింగ్ కు పరిమితం అయిన క్యాష్ ఆన్ డెలివరి విధానంను రైల్వే టికెట్ల బుకింగ్ కు కూడా వర్తింప చేస్తోంది. వచ్చే నెలలోనే ఢిల్లీలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. టికెట్ మీ ఇంటికి వస్తేనే డబ్బులివ్వండి.., లేదంటే అవసరం లేదు అని రైల్వే శాఖ సగర్వంగా చెప్పుకుంటోంది. డెబిట్, క్రెడిట్ కార్డులు లేని ప్రయాణికులతో పాటు, తమ కార్డు వివరాలు ఆన్ లైన్ లో ఇవ్వటానికి ఇష్టపడని ప్రయాణికులకు ఇది బాగా ఉపయోగపడుతుందని రైల్వే చెప్తోంది. అందురిల్ టెక్నాలజిస్ అనే ప్రయివేటు సంస్థ భాగస్వామ్యంతో అందిస్తున్న ఈ సౌకర్యం వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సదుపాయంకు ఈ -డాకియా అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఇందుకోసం ప్రత్యేకంగా bookmytrain.com అనే వెబ్ సైట్ అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వెబ్ సైట్ ను క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్న కంపనీ నిర్వహిస్తోంది.

వెబ్ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో అడ్రస్, ఫోన్ నంబర్ వంటి వివరాలు తీసుకుంటారు. టికెట్ బుక్ అయిన తర్వాత డెలివరి సంస్థ ఏజంటు వచ్చి టికెట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ టికెట్ తీసుకోకపోయినా రైల్వేశాఖకు నష్టం ఏమి లేదు. ఎందుకంటే టికెట్ బుక్ చేసుకున్న సమయంలోనే ప్రయాణికుడి తరపున డబ్బులను బుకింగ్ సంస్థ చెల్లిస్తుంది. కాబట్టి.., టికెట్ క్యాన్సిల్ అయినా.., ప్రయాణికుడు వద్దని గొడవ చేసినా రైల్వేకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే సాధారణ బుకింగ్ తో పోలిస్తే క్యాష్ ఆన్ డెలివరి టికెట్ కాస్త ఖరీదు ఎక్కువ. ఏసి క్లాసు టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే టికెట్ ధరపై అదనంగా 60 రూపాయలు, నాన్ ఏసీలోని అన్ని విభాగాల టికెట్లకు 40 రూపాయలు అధికంగా వసూలు చేస్తారు. వీటికి తోడు రైల్వే సర్వీస్ చార్జిలు, బ్యాంకు చార్జీలు అదనంగా ఉంటాయి. కాబట్టి ఈ టికెట్ కొనేముందు కాస్త ఆలోచించటం ఉత్తమం.

గతేడాది రైల్వే శాఖ సగం మేర సీట్లు ఆన్ లైన్ లోనే బుక్కయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్, ఈ టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ ను చూసి.., ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు కొత్త విధానం తీసుకొచ్చినట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సదుపాయం వస్తే.., క్యూ లైన్ల దగ్గర గంటలకొద్ది నిలబడే ఇబ్బంది తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఈ టికెట్ వినియోగం పెరిగితే ప్రస్తుతం అంతగా ఆదరణ లేని ఐ టికెట్ ను తొలగించాలని కూడా నిర్ణయించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.., టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే వారు తప్పనిసరిగా నెట్ ను ఆశ్రయించాల్సిందే. కేవలం ముందుగా డబ్బులు కట్టడం మాత్రమే మినహాయింపు. అదికూడా తర్వాత అధికంగా వసూలు చేస్తారు. మరి సగటు ప్రయాణికులు ఈ పధకాన్ని ఆదరిస్తారా? లేక పక్కనబెడతారా అనేది అమలవుతేనే తెలుస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railway  cash on delivery  online ticket booking  irctc  

Other Articles