Tdp party ministers demands jagan to say sorry for calling them as baffoons

ap assembly, tdp ministers, tdp mlas, ys jagan mohan reddy, ruckus in ap assembly, speaker kodela siva prasad rao, ysr congress party ministers

tdp party ministers demands jagan to say sorry for calling them as baffoons

జగన్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే! టీడీపీ

Posted: 08/23/2014 11:30 AM IST
Tdp party ministers demands jagan to say sorry for calling them as baffoons

టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఎప్పటినుంచో వుంది. ఈ రెండు పార్టీల్లోని కార్యకర్తలు నోరువిప్పితే చాలు... తమతమ ప్రత్యర్థ పార్టీ నాయకుల మీద విమర్శలే విమర్శలు! ఒక్క చిన్న వివాదం జరిగిన సరే... అది తారాస్థాయికి చేరిపోతుంది. ఇటువంటి వివాదాలు ఇప్పటికే చాలా జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఏపీ అసెంబ్లీలో ఈ రెండు పార్టల మధ్య పెద్ద వాగ్యుద్ధమే జరుగుతోంది. హత్యారాజకీయాల మీద చర్చలు మొదలైన అనంతరం... తమతమ పార్టీ నాయకుల హత్యల ఆరోపణలను ప్రత్యర్థుల మీద వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల హత్య విషయం రాగా.. అది పెద్ద దుమారంగా మారిపోయింది.

పరిటాల రవి హత్యకు జగనే ముఖ్యకారణం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయగా... జగన్ వారికి ధీటుగానే సమాధానం చెబుతూ ‘‘పరిటాల రవి హత్యలో వున్న నిజానిజాలు చంద్రబాబుకు అన్నీ తెలుసు’’ అని కుండబద్ధలు కొట్టేశారు. అయితే ఈ హత్యకేసులోనే భాగంగా ఒకరి మీద ఒకరు బాగానే దుమ్మెత్తిపోసుకున్నారు. ప్రస్తుతం ఇది తారాస్థాయికి చేరిపోయింది. ముఖ్యంగా తెదేపా పార్టీ ఎమ్మెల్యేలు అయితే జగన్ పై ఈ హత్యకేసుకు సంబంధించి విమర్శల జల్లులు కురిపించారు. తెదేపా సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ‘‘జగన్ కు భానుకిరణ్, కృష్ణ తెలుసా?’’ అని ప్రశ్నించారు.

ఇలా రకరకాలుగా ఆయన్ను జగన్ ను తూట్లు పొడిచేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన జగన్.. టీడీపీ పార్టీలో వున్న మంత్రులందరినీ ‘‘బఫూన్స్’’ అంటూ వ్యాక్యానించేశారు. దీనిపై మండిపడిన తెదేపా పార్టీ సభ్యులు.. జగన్ తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ చుట్టూ టీడీపీ సభ్యులు జగన్ క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనలకు దిగారు. అందుకు ప్రతిగా వైకాపా సభ్యులు కూడా నినాదాలు చేయడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles