Govt to rope in corporates for clean india mission

narendra modi, nitin gadkari, narendra modi latest news, nitin gadkari latest news, indian corporate companies, clean india mission

Govt to rope in corporates for 'Clean India' mission : narendra modi government is roping corporate companies for clean india mission

‘‘స్వచ్ఛమైన భారతం’’ కోసం మోడీ తెలివైన పన్నాగం!

Posted: 08/26/2014 01:10 PM IST
Govt to rope in corporates for clean india mission

సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ నిర్వహించిన అనేక ప్రచారాల నేపథ్యంలో ఆయన భారత పారిశుధ్ధ్యానికి సంబంధించి కొన్ని పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే! ఈ పథకంలో భాగంగా భారతదేశంలో వున్న అన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయించడం, తాగునీరు సౌకర్యాలను కల్పించడం! అయితే యావత్తు దేశం మొత్తం మీదున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాలను చేపట్టాలంటే అందుకు నిధులను భారీమొత్తంలో కేటాయించాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి రుగుదొడ్లు, తాగునీరు సౌకర్యాలకు కల్పించడానికి కనీసంలో కనీసం 10,000 చొప్పున నిధులు ఇవ్వాల్సి వుంటుంది. ఈ లెక్కన ఇచ్చుకుంటూపోతే... కొన్నివేల కోట్ల రూపాయలు కేవలం ఈ పథకానికే సమర్పించుకోవాల్సి వుంటుంది. అందుకే దీనిని అమలు చేయడానికి ఆయన ఒక పన్నాగం పన్నారు. స్వచ్ఛమైన భారత్ పథకంలో భాగంగా మోడీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో కలిసి భాగస్వామ్యం పంచుకోవడానికి అడుగులు ముందుకు వేస్తోంది.

ఈ విషయం మీద నీళ్లు - పరిశుభ్రత కేంద్రమంత్రి అయిన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘భారత ప్రభుత్వం నరేంద్రమోడీ నిర్దేశించిన ‘‘స్వచ్ఛ్ భారత్’’ పథకాన్ని పూర్తి చేసే దిశలో ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటోందని.. 2019కల్లా ఈ ప్రణాళిక పూర్తవుతుంది’’ అని ఆయన వెల్లడించారు. గ్రామీణ పారిశుద్ధ్యం, తాగునీరు పథకాలను సమీక్షించాలంటూ కేంద్రమంత్రుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రధాని మోడీ ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం ఈ స్కీములకు తగినంత నిధులను నిర్థారించడానికి ఒప్పుకుంది. ఆయన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇతర రాష్ట్రాల సహాయాన్ని కూడా కోరింది. అంతేకాదు.. ఈ ప్రణాళికను పూర్తి చేయడానికి ఇతర రాష్ట్రాల మద్దతుతోపాటు భారతప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రిత్వశాఖల పథకాలను, రాష్ట్ర పథకాలను ఏకీభవించి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటాం. కొన్ని కార్పొరేట్ సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీలు మోడీ ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ్ భారత్ ప్రణాళికలోభాగస్వామ్యం పంచుకోవడానికి ముందుకు వచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ మాట్లాడిన ప్రసంగంలో ఆయన పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు నిర్మించేందుకు పిలుపునిచ్చారు. దాంతో భారతి ఫౌండేషన్, టాటా కన్సల్టన్సీ వారు తమ సంబంధింత సీఎస్ఆర్ నిధుల నుంచి 100 కోట్లమేర నిధులను కేటాయించి దేశవ్యాప్తంగా వున్న స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టించేందుకు సిద్ధమయ్యాయి. అలాగే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కూడా 1000 స్కూళ్లలో టాయిలెట్లను కట్టించడానికి ముందుకు వచ్చినట్టు యూనియన్ ఎనర్జీ మినిస్టర్ పియూష్ గోయల్ తనకు స్పష్టం చేసినట్టు గడ్కరీ తెలిపారు. ప్రస్తుతానికి గ్రామీణా ప్రాంతాల్లో వున్నవారికి ప్రత్యేక మరుగుదొడ్లు కోసం 10,000 చొప్పున డబ్బులు కేటాయించడం జరిగిందని.. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన 67 సంవత్సరాల తరువాత కూడా మన భారతదేశంలోని దాదాపు 60 శాతం వరకు ప్రజలు బయటిప్రాంతాల్లోనే మరుగుదొడ్లుగా మార్చేసుకున్నారని.. ఇప్పుడు గ్రామీణ పారిశుద్ధ్య భాగంగా అలా కాకుండా అందరికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని.. నరేంద్రమోడీ లక్ష్యాన్ని 2019 కల్లా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  nitin gadkari  clean india mission  indian corporate companies  

Other Articles