Telangana people killed congress party in telangana state

sarve satyanarayana, former central minister sarve satyanarayana, telangana state, telangana people, congress party, medak mp elections, medak mp by elections, cm kcr, telangana people, telangana state news, chandrababu naidu, former minister sridhar babu, sonia gandhi

telangana people killed congress party in telangana state : the former central minister sarve satyanarayana controversial comments on telangana state people

కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు చంపేశారు : సర్వే

Posted: 09/01/2014 03:15 PM IST
Telangana people killed congress party in telangana state

(Image source from: telangana people killed congress party in telangana state)

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంమొత్తం మీద ఎంత ఘోరంగా ఓటమి చవిచూసిందో అందరికీ తెలిసిన విషయమే! ఇంతవరకు భారతీయ రాజకీయ చరిత్రలో లేనంతగా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మరీ ఎంత ఘోరంగా అంటే... కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇదిలావుండగా.. తెలంగాణ తమ పార్టీయే గెలుస్తుందన్న ధీమాతో ఆంధ్రప్రదేశ్ ను కాదనుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చేశారు. అయినప్పటికీ వారికి ఎటువంటి లాభం ఒరగలేదు. అటు ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తంగా తుడిచుకునిపోతే... తెలంగాణాలో సైతం చాలా తక్కువ ఓట్లను మాత్రమే నమోదు చేసుకోగలిగింది. తమ పార్టీని గెలవడం ఖాయమని డప్పులు వాయించుకున్న కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాలతో పత్తాలేకుండా కనుమరుగైపోయారు. ఇక సోనియా గాంధీ అయితే పాపం.. తెలంగాణ మీద ఆమె పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు చంపేశారంటూ సర్వే అంటున్నారు. ఇక్కడ సర్వే అంటే ఏ న్యూస్ ఛానెల్ నిర్వహించిందో లేక మేగజైన్ వారు నిర్వహించిన నివేదిక అయితే మాత్రం కాదులెండి... మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ! మెదక్ ఉప ఎన్నికల ప్రచార నేపథ్యంలో సర్వే సత్యనారాయణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణమైన ‘తల్లి’ని (సోనియాగాంధీని ఉద్దేశించి) తెలంగాన ప్రజలు పూర్తిగా మరిచిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కష్టనష్టాలను సోనియాగాంధీ ఎదుర్కుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే... ఆమెకు కనీస కృతజ్ఞతలు కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

అలాగే మరో మాజీమంత్రి శ్రీధర్ బాబు మెదక్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోతుందని తెలిసికూడా సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాన ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే ఆశాభావంతోనే ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు తమ పార్టీ తరఫున ప్రచారాలు చేసుకోవడం మొదలుపెట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles