(Image source from: ap cm chandrababu naidu capital state statement in assembly)
విభజన అనంతరం ఆంధ్రరాజధాని విషయంమీద ఎన్నో తర్జనభర్జనల మధ్య శివరామకృష్ణన్ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదికలు పంపించిన నేపథ్యంలో.. దానిని దీర్ఘంగా పరిశీలించిన తర్వాత ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుకు తిరిగి పంపించడం జరిగింది. దీంతో ఆయన మంగళవారం అసెంబ్లీ చర్చల్లో రాజధానిపై ప్రకటన చేయడానికి సిద్ధపడ్డారు. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన ఆంధ్రాకు చివరకు రాజధాని కళ వచ్చేసిందని అనుకున్న తరుణంలో.. చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రజలను నిరాశపరిచేశారు. అదిగోఇదిగో అంటూనే ఇన్నాళ్లవరకు వాయిదా వేసుకుంటూ వచ్చిన బాబు... ఇప్పుడు దానిపై ప్రకటన ఇవ్వనున్నారని ఆశలు పెట్టుకున్న ప్రజలకు చివరకు అడియాశలే మిగిలాయి.
సీఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో ఏపీ రాజధానిపై చేయాల్సిన ప్రకటనను వాయిదా వేసేశారు. అందుకు సంబంధించిన పత్రాలు ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవడంతోపాటు.. ఈరోజు (మంగళవారం) తిథి అష్టమి (మంచి రోజు కాదు) అని పలు కారణాల నేపథ్యంలో ప్రకటననను గురువారం నాటికి వాయిదా వేశారు. తొందరపడి ప్రకటన చేసేదానికన్నా.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిశీలించాలని కూడా ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయన మరోసారి తన మంత్రులతోపాటు కమిటీతో కలిసి దీర్ఘంగా ఆలోచించాలనే భావనతో వున్నట్లు వార్తలు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. ఒకవేళ రైతులు తమ భూములను ఇవ్వడానికి ముందుకు వస్తే విజయవాడకు అతి సమీపంలో వున్న మంగళగిరిని రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రభుత్వం నిశ్చయించుకుంది. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోతే.. నూజువీడును రెండో ఆప్షన్ కింద పెట్టినట్లు మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు 17 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి వుండగా.. నూజువీడు సుమారు 42 కిలోమీటర్ల దూరంలో వుంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ముందుగానే అభివృద్ధి చెందినవి కాబట్టి.. వాటి మధ్యనున్న ఈ ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేస్తే.. తక్కువ సమయంలో సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతోనే బాబు, కమిటీ సభ్యులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే గురువారం బాబు చేసే ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more