(Image source from: central minister sadananda gowda son karthik gowda escaped)
ప్రేమపేరుతో తనను లొంగదీసుకుని మోసం చేశాడంటూ కన్నడ నటి మైత్రేయి గౌడ ప్రస్తుతం కేంద్రరైల్వేమంత్రి సదానంద కుమారుడు కార్తీక్ గౌడపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! దీంతో బెంగుళూరు ఆర్టీనగర్ పోలీసులు అతనిపై 420 కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వారు కార్తీక్ వెంటనే లొంగిపోవాల్సిందిగా సోమవారంనాడు అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా తాను స్వయంగా వచ్చి లొంగిపోకపోతే బలవంతంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు కూడా!
తాను లొంగిపోవాల్సిందిగా కార్తీక్ కు పోలీసులు అదేరోజు (సోమవారం) నోటీసులు పంపించినప్పటికీ.. అతడు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అడ్రస్ లేకుండా పోయాడు. అంతేకాదు.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును కూడా ఆశ్రయించాడు. దీంతో ఇతడు ఆ అమ్మాయిని నిజంగానే మోసం చేశాడంటూ అనుమానాలు దాదాపు పూర్తిగా నిజమవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.ప్రేమపేరుతో మొదట తనను పెళ్లి చేసుకుని, కోరికలన్నీ తీరిపోయిన తర్వాత వేరే యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ మైత్రేయి ఇచ్చిన ఫిర్యాదును మొదట పోలీసులు ఖంగుతిన్నారు. అయితే ఒక నటి అది కూడా బహిరంగంగా ఇలా తన ఆవేదనను వ్యక్తపరచడాన్ని చూసిన పోలీసులు మొదట క్లారిఫికేషన్ కోసం ఆమెను వైద్యపరీక్షల కోసం పంపిచారు.
అనంతరం కార్తీక్ కేంద్రమంత్రి కొడుకు కావడంవల్ల ఎన్నో తర్జనభర్జనల మధ్య విచారణలు జరిపిన తర్వాత చివరికి పోలీసులు అతడిపై 420 కేసును నమోదు చేశారు. అయితే అతనుమాత్రం ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికో చెక్కేశాడు. ఈ కేసుపై విచారణ ఈవారంలోనే జరగనుంది. దీంతో ఈ లోపలే అతడిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలన్న ఆలోచనలతో పోలీసులు తాజాగా అతను లొంగిపోవాల్సిందిగ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more